తిరుమలలో ఎటువంటి అపచారం జరగలేదు- టీటీడీ

బ్రహ్మోత్సవాల సందర్భంగా అన్నింటిని ముందుగా తనిఖీలు చేస్తామని టీటీడీ అధికారులు వెల్లడించారు.

తిరుమలలో ఎటువంటి అపచారం జరగలేదు- టీటీడీ

Ttd (Photo Credit : Google)

Updated On : October 4, 2024 / 5:55 PM IST

Ttd : తిరుమలలో ఎలాంటి అపచారం జరగలేదని టీటీడీ చెప్పింది. వదంతులు నమ్మవద్దని కోరుతోంది. ధ్వజస్తంభంపై కొక్కి విరిగిపోయిందన్న వదంతులు స్ప్రెడ్ అయిన నేపథ్యంలో టీటీడీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. అపచారం జరిగిందన్న వదంతుల్లో ఏ మాత్రం వాస్తవం లేదు అని చెప్పి టీటీడీ తెలిపింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా అన్నింటిని ముందుగా తనిఖీలు చేస్తామని టీటీడీ అధికారులు వెల్లడించారు. ధ్వజపటాన్ని ఎగురవేసేందుకు పాత వాటి స్థానంలో కొత్తవి అమర్చడం ఆనవాయితీ అని చెప్పే ప్రయత్నం చేసింది టీటీడీ.

Also Read : తిరుమల శ్రీవారికి రోజుకు ఎన్నిసార్లు..? ఏ సమయంలో ఏ నైవేద్యం సమర్పిస్తారో తెలుసా..

ధ్వజ స్తంభంపైన ఉండే కొక్కీ విరిగిపోయిందని వదంతులు వ్యాపించాయి. దీనిపై టీటీడీ స్పష్టత ఇచ్చింది. కొక్కీ విరిగిపోయిందన్న వార్తలు అవాస్తవం అంది. ధ్వజారోహణం నేపథ్యంలో తాము అన్ని తనిఖీలు చేస్తామని, ఏదైనా భిన్నంగా ఉంటే, వాటి తొలగించి వాటి స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఎక్కడైనా పూజలు జరిగే సమయంలో ఆనవాయితీగా తాము చేస్తామని టీటీడీ వివరణ ఇచ్చింది.

ఎటువంటి అపచారమూ జరగలేదని టీటీడీ తేల్చి చెప్పింది. కొక్కీ భిన్నంగా ఉందని గుర్తించి, దాన్ని తొలగించి, మరొక దాన్ని ఏర్పాటు చేశామన్నారు. సీఎం చంద్రబాబు తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. బేడి ఆంజనేయ స్వామి ఆలయం వద్ద నుంచి తల మీద వెండి ప్లేటుపై పట్టువస్త్రాలు పెట్టుకుని శ్రీవారి ఆలయానికి వచ్చి సమర్పిస్తారు. అనంతరం పెద్దశేషవాహన సేవ జరురుగుతుంది. రాత్రి 9 గంటలకు జరిగే ఈ సేవలో ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు పాల్గొంటారు.