కండలవీరుడిని వెంటాడుతున్న ప్రాణభయం..! బిష్ణోయ్ గ్యాంగ్ నెక్ట్స్ టార్గెట్ సల్మాన్ ఖానేనా?

సల్మాన్ ఖాన్ బాలీవుడ్ హీరో. బిష్ణోయ్ గ్యాంగ్ పంజాబ్ కి చెందిన చిన్న తెగ. అసలు వీరిద్దరి మధ్య శత్రుత్వం ఏంటి?

కండలవీరుడిని వెంటాడుతున్న ప్రాణభయం..! బిష్ణోయ్ గ్యాంగ్ నెక్ట్స్ టార్గెట్ సల్మాన్ ఖానేనా?

Salman Khan In Danger (Photo Credit : Google)

Updated On : October 15, 2024 / 12:02 AM IST

Target Salman Khan : బాలీవుడ్ కండల వీరుడికి ప్రాణభయం పొంచి ఉందా? బిష్ణోయ్ గ్యాంగ్ కు సల్మాన్ టార్గెట్ అయ్యాడా? నిత్యం ఫ్యాన్స్ తో సందడిగా ఉండే బాంద్రా ఇప్పుడు ఎందుకు పోలీసులతో నిండిపోయింది? సల్లూ భాయ్ ఎందుకు గడపదాటం లేదు? అతడి స్నేహితుడు సిద్ధిఖీని ఈ గ్యాంగ్ ఎందుకు చంపింది? సల్మాన్ పై కోపంతోనే సిద్ధిఖీని మట్టుబెట్టారా? పోలీసుల విచారణలో బయటపడ్డ అసలు నిజాలేంటి?

సల్మాన్ ఖాన్ బాలీవుడ్ హీరో. బిష్ణోయ్ గ్యాంగ్ పంజాబ్ కి చెందిన చిన్న తెగ. అసలు వీరిద్దరి మధ్య శత్రుత్వం ఏంటి? బిష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్ ఖాన్ ను ఎందుకు టార్గెట్ చేసింది? చంపేంత తప్పు సల్మాన్ ఏం చేశారు? సల్మాన్ పై ఉన్న పాత కేసుకు బిష్ణోయ్ గ్యాంగ్ కు ఉన్న లింకులు ఏంటి? బిష్ణోయ్ గ్యాంగ్ మరో దావూద్ మాఫియాగా మారబోతోందా?

సల్మాన్ ఖాన్ 1999లో జింకల వేట కేసును ఎదుర్కొన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ కేసులో కోర్టు అతడిని దోషిగా ప్రకటించింది. దీన్ని సవాల్ చేస్తూ సల్మాన్ ఖాన్ హైకోర్టుని ఆశ్రయించాడు. దీంతో బెయిల్ వచ్చింది. కానీ, ఆ తప్పు మాత్రం సల్మాన్ ను వెంటాడుతూనే ఉంది. 1999లో సల్మాన్ ఖాన్ హమ్ సాథ్ సాథ్ హై సినిమా విడుదలైంది. ఈ సినిమా షూటింగ్ ఎక్కువ శాతం రాజస్తాన్ లో జరిగింది. షూటింగ్ సమయంలో సల్మాన్ ఖాన్ తన సహ నటులతో కలిసి అక్కడి అడవుల్లో సంచరించే ప్రత్యేకమైన బ్లాక్ బక్ జాతి జింకలను వేటాడారు. వీటిని స్థానికంగా కృష్ణ జింకలు అని పిలుస్తారు. అప్పట్లో సల్మాన్ పై ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. కానీ, ఇంతవరకు సల్మాన్ కు జైలు శిక్ష పడలేదు.

సల్మాన్ ఖాన్ శిక్ష నుంచి అయితే తప్పించుకున్నాడు కానీ, ఆ ఘటన బిష్ణోయ్ వర్గాన్ని ఆగ్రహానికి గురి చేసింది. ఆ కృష్ణ జింకలను బిష్ణోయ్ సామాజికవర్గం తమ కులదైవానికి ప్రతీకగా పూజిస్తుంది. జింకలను పవిత్ర జంతువులుగా ఆరాధిస్తుంది. అలాంటి పవిత్ర జింకలను సల్మాన్ వేటాడి చంపాడని బిష్ణోయ్ సామాజిక వర్గం సల్మాన్ పై కోపం పెంచుకుంది. అప్పటి నుంచి సల్మాన్ క్షమాపణలు చెప్పాలని బిష్ణోయ్ సామాజికవర్గం పట్టుబడుతోంది. కానీ, ఇంతవరకు సల్మాన్ సారీ చెప్పింది లేదు. గతంలో సల్మాన్ తరుపున అతడి మాజీ ప్రేయసి సోమీ అలీ క్షమాపణలు చెప్పింది. కానీ, బిష్ణోయ్ వర్గం మరింత ఆగ్రహం వ్యక్తం చేసింది. సల్మాన్ క్షమాపణలు చెబితేనే పరిగణలోకి తీసుకుంటామంది. సల్మాన్ గుడికి రావాలి, స్వయంగా సారీ చెప్పాలని డిమాండ్ చేస్తోంది బిష్ణోయ్ వర్గం.

ఇప్పుడు సల్మాన్ ను టార్గెట్ చేసిన గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ కూడా అదే సామాజికవర్గానికి చెందిన వాడు. 2018లోనే ఓ కోర్టు కేసు విచారణ సమయంలో సల్మాన్ ను చంపుతాను అని లారెన్స్ బిష్ణోయ్ బహిరంగంగానే ప్రకటించాడు. అప్పటి నుంచి సల్మాన్ హత్యకు ప్రయత్నిస్తున్నాడని, సల్మాన్ సన్నిహితుడు బాబా సిద్ధిఖీని అందుకే హత్య చేశాడని ఇప్పుడు కథనాలు వెలువడుతున్నాయి.

 

Also Read : సల్మాన్ ఫస్ట్ టార్గెట్.. లారెన్స్ బిష్ణోయ్ ‘హిట్-లిస్ట్’లో పేర్లు ఇవే.. ఎవరెవరు ఉన్నారంటే?