Karnatak High Court : భార్య ఇంట్లో ఖాళీగా ఉండకూడదు: హైకోర్టు కీలక వ్యాఖ్యలు
భర్తే అంతా ఇవ్వాలా?భార్య ఇంట్లో ఖాళీగా కూర్చోకూడదు ఏదొకటి చేయాలి అంటూ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఖాళీగా ఎందుకు ఉంది? అంటూ ప్రశ్నించింది.

Wife Cannot Sit Idle Karnataka High Court
Wife Cannot Sit Idle Karnataka High Court: కర్ణాటక హైకోర్టు ఓ కేసు విషయంలో కీలక వ్యాఖ్యలు చేసింది. భార్యలు ఇంట్లో ఖాళీగా ఉండకూడదు.. అంటూ వ్యాఖ్యానించింది. భర్త నుంచి విడాకులు తీసుకున్న ఓ మహిళ తనకు ఇచ్చే భరణంలో కోత పెట్టారంటూ వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా కర్ణాటక హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. భార్యలు ఇంట్లో ఖాళీగా ఉండకూడదు.. భర్త నుంచి భరణం తీసుకునే సదరు మహిళ కూడా ఉపాధి కోసం ఏదైనా పనిచేసుకోవాలి అంటూ అత్యంత కీలక వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు ఆమెకు భరణం అందుకోవాల్సిన అవసరాలు ఏమిటో కూడా చెప్పాలని వెల్లడించింది.
విడాకులు తీసుకున్న భర్త తనకు భరణం తక్కువగా ఇస్తున్నాడని ఓ మహిళ కోర్టు మెట్లెక్కెంది. మేజిస్ట్రేట్ కోర్టు తనకు ఇచ్చిన భరణాన్ని నిర్ణయించినంతగా కాకుండా తక్కువగా ఇస్తుండటాన్ని సవాలు చేస్తూ ఆమె పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం ఆమె భరణం అందుకోదగిన అవసరాలు ఏమిటో చెప్పాలని ప్రశ్నించింది. పిటిషనర్ కు మొత్తం మెయింటెనెన్స్ భర్తే ఎందుకు ఇవ్వాలి? అని ప్రశ్నించింది. అంతేకాదు ఆమె ఖాళీగా ఉండకుండా జీవనోపాధి కోసం ఏదైనా పని చేసుకోమని సూచించింది.
Madras High Court : భర్త ఆస్తులన్నింటిలోను భార్యకు సమాన వాటా : హైకోర్టు కీలక తీర్పు
సదరు మహిళకు సెషన్స్ కోర్టు (Sessions Court) దాఖలు చేసిన ఉత్తర్వుల ప్రకారం.. భరణం రూ .10,000 నుండి రూ .5,000 కు, పరిహారాన్ని రూ .3 లక్షల నుండి రూ .2 లక్షలకు తగ్గించారు. దీంతో ఆమె అది తనకు సరిపోదని.. సెషన్స్ కోర్టు భరణాన్ని తగ్గించిందని హైకోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్ ను విచారించిన జస్టిస్ రాజేంద్ర బాదామికర్ (Justice Rajendra Badamikar)తో కూడిన సింగిల్ జడ్జి బెంచ్(single judge bench).. వివాహం తరువాత ఆమె (భార్య) ఎందుకు పనిచేయలేకపోయిందో సరైన వివరణ లేదని వ్యాఖ్యానించింది. పెళ్లికి ముందు ఆమె ఉద్యోగం చేస్తూ సంపాదించేంది. కానీ వివాహం తరువాత ఉద్యోగం మానివేసింది.
అలా ఆమె ఖాళీగా ఇంట్లో ఉండకూడదు తన భర్త నుంచి మొత్తం మెయింటెనెన్స్ కోరకూడదు అని తేల్చి చెప్పింది. దీంతో పిటిషనర్ షాక్ అయ్యింది. ఆమె తన భర్త నుండి సహాయక భరణాన్ని(Supportive Maintenance) మాత్రమే కోరవచ్చు అని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో పిటిషనర్ అయిన మహిళ అత్తగారి ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి ఉండటానికి సుముఖంగా లేదని ఇది మహిళలకు తగదు అంటూ సదరు మహిళ పిటిషన్ ను కొట్టివేసింది.
Private Travels Bus : బస్సులో రీసౌండ్ మ్యూజిక్ పెట్టింనందుకు కండక్టరు, డ్రైవర్‌కు రూ.10,000 జరిమానా