క‌రెంట్ షాక్‌తో భ‌ర్త‌ను చిత్ర‌హింస‌లు పెట్టిన భార్య‌.. ఎందుకో తెలిస్తే అవాక్క‌వ్వాల్సిందే!

భార్య పెట్టే చిత్ర హింసల నుంచి బయటపడిన ప్రదీప్ సింగ్ స్థానిక పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశాడు. తన భార్య నుంచి తనను కాపాడాలంటూ పోలీసులను వేడుకున్నాడు.

క‌రెంట్ షాక్‌తో భ‌ర్త‌ను చిత్ర‌హింస‌లు పెట్టిన భార్య‌.. ఎందుకో తెలిస్తే అవాక్క‌వ్వాల్సిందే!

electric shock (representation image)

Updated On : May 31, 2024 / 1:12 PM IST

Wife Gave Electric Shock To Husband : భర్తపై కక్ష పెంచుకున్న భార్య దారుణానికి పాల్పడింది. మత్తు మందు ఇచ్చి, కరెంట్ షాక్ పెడుతూ చిత్రహింసలు పెట్టింది. భార్య నుంచి తప్పించుకున్న భర్త.. పోలీసులను ఆశ్రయించి తన గోడును వెల్లబోసుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మెయిన్ పూరీలో చోటు చేసుకుంది. ఇంతకీ భర్త పట్ల ఆమె ఎందుకలా ప్రవర్తించిందో తెలుసుకొనేందుకు పోలీసులు ప్రయత్నించారు. అసలు విషయం తెలుసుకొని అవాక్కయ్యారు. తన ఫోన్ తీసుకున్నాడని భర్తకు కరెంట్ షాక్ ఇచ్చి చిత్రహింసలు పెట్టిందట. పూర్తి వివరాల్లోకి వెళితే..

Also Read : ప్రేమోన్మాది ఘాతుకం.. పెళ్లికి ఒప్పుకోలేదని యువతి గొంతుకోసి హత్యచేశాడు.. ఆ తరువాత..

2007 లో బీబీ యాదవ్ ను ప్రదీప్ సింగ్ వివాహం చేసుకున్నాడు. వారికి 14 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. బీబే యాదవ్ కొద్దిరోజులుగా నిత్యం వేరే వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతుంది. ప్రతీరోజూ మొబైల్ ఫోన్ లో ఎవరితో మాట్లాడుతున్నావ్ అంటూ ప్రదీప్ సింగ్ మందలించాడు. అయినా బేబీ యాదవ్ లో మార్పురాలేదు. ఆగ్రహంతో ఆమె ఫోన్ ను భర్త తీసుకున్నాడు. దీంతో భర్తపై కక్షపెంచుకున్న బీబీ యాదవ్ భర్తను చిత్ర హింసలకు గురిచేయడం ప్రారంభించింది. వారం రోజులుగా క్రికెట్ బ్యాట్ తో పదేపదే భర్తను కొట్టింది. కొడుకు జోక్యం చేసుకోబోగా అతనిపైనా బీబీ యాదవ్ దాడిచేసింది. దీనికితోడు భర్తను మంచానికి కట్టేసి కరెంట్ షాక్ ఇచ్చి చిత్ర హింసలకు గురిచేసింది.

Also Read : ఎట్టకేలకు దొరికాడు..! మాజీ ప్రధాని దేవెగౌడ మనవడ్ని ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేసిన పోలీసులు

భార్య పెట్టే చిత్ర హింసల నుంచి బయటపడిన ప్రదీప్ సింగ్ స్థానిక పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశాడు. తన భార్య నుంచి తనను కాపాడాలంటూ పోలీసులను వేడుకున్నాడు. అప్పటికే తీవ్ర గాయాలతో ఉన్న ప్రదీప్ సింగ్ ను చికిత్స నిమిత్తం సైఫాయి మెడికల్ కాలేజీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేయగా.. భార్య చిత్రహింసలు పెట్టింది నిజమేనని తేలింది. ఆమెపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ప్రస్తుతం ఆమె పరారీలో ఉంది.