Mayawati సంచలన ప్రకటన..మోదీ సర్కార్ కి మద్దతిస్తా

బహుజన్ సమాజ్ పార్టీ (BSP) అధినేత్రి మాయావతి.. కేంద్ర ప్రభుత్వానికి మద్దతుపై శుక్రవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Mayawati సంచలన ప్రకటన..మోదీ సర్కార్ కి మద్దతిస్తా

Maya Modi

Updated On : August 6, 2021 / 9:30 PM IST

Mayawati బహుజన్ సమాజ్ పార్టీ (BSP) అధినేత్రి మాయావతి.. కేంద్ర ప్రభుత్వానికి మద్దతుపై శుక్రవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇతర వెనకబడిన తరగతుల (OBC) జనాభా గణన నిర్వహించడం కోసం నిర్మాణాత్మకమైన చర్యలు తీసుకుంటే కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంట్‌ లోపల, బయటా మద్దతు ఇస్తామని మాయావతి తెలిపారు. కాగా,  కేంద్రం ప్రతిపాదించినట్లుగా  ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే జనగణన పరిమితం చేయరాదని, అన్ని కులాల వారిగా జనగణన చేపట్టాలని బీహార్ సీఎం నితీశ్ కుమార్ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే మాయావతి ఈ విధంగా స్పందించడం గమనార్హం.

కులాల ఆధారంగా జనాభా గణనపై చర్చించడానికి బీహార్‌ సీఎం నితీష్‌కుమార్‌ గురువారం ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్‌ ను కోరిన నేపధ్యంలో మాయావతి శుక్రవారం ట్విట్టర్ వేదికగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నారు. దేశంలో ఓబీసీ జనాభా గణన కోసం బీఎస్పీ డిమాండ్‌ చేస్తోందని…కేంద్ర ప్రభుత్వం కనుక ఈ దిశగా ఏదైనా అనుకూల చర్యలు తీసకుంటే, పార్లమెంట్‌ లోపల, బయటా కేంద్రానికి మద్దతు ఇస్తాం అని మాయావతి హిందీలో చేసిన ట్వీట్‌ లో తెలిపారు.