లాక్ డౌన్ సడలింపు ముందుగా ఎక్కడంటే.. ఏపీలో రెండు జిల్లాలు!

  • Published By: vamsi ,Published On : April 6, 2020 / 04:28 AM IST
లాక్ డౌన్ సడలింపు ముందుగా ఎక్కడంటే.. ఏపీలో రెండు జిల్లాలు!

Updated On : April 6, 2020 / 4:28 AM IST

లాక్ డౌన్ పొడిగిస్తారా ? లేక ఎత్తేస్తారా ? ఒకవేళ కొన్ని ప్రాంతాల్లో ఆంక్షలు అమలు చేస్తారా ? ఇలాంటివి ఎన్నో సందేహాలు.. ఇప్పటికే ఆర్థికంగా దేశం దెబ్బ తినింది. ఈ క్రమంలో కీలక విషయం బయటకు వస్తుంది.  కరోనావైరస్(కోవిడ్ -19 వ్యాధి) కేసులు లేని జిల్లాల్లో కదలికను కేంద్రం గమనిస్తుంది. అటువంటి జిల్లాల్లో వాణిజ్య కార్యకలాపాలకు అవకాశం కల్పించాలని కేంద్రం భావిస్తుంది. ఈ మేరకు రాష్ట్రాల నుంచి రిపోర్ట్‌లు తీసుకుంటుంది. 

దేశవ్యాప్తంగా ఏప్రిల్ 15న లాక్ డౌన్ ఎత్తివేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ..  భారతదేశంలో 4వేల కోవిడ్ -19 కేసులు ఉన్నాయి. రోజురోజుకు అవి పెరుగుతున్నాయే కానీ తగ్గట్లేదు.. ఈ క్రమంలో లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేస్తే పరిస్థితి అదుపు చెయ్యడం ఎవరి వల్ల కాదు అనేది కేంద్రం ఆలోచన. అందుకే కొన్ని నిబందనలతో రాష్ట్రాల్లో సడలింపులు చెయ్యాలని ప్రభుత్వం ఆలోచన..(నిబంధనలు పట్టించుకోని మహారాష్ట్ర ఎమ్మెల్యే…బర్త్ డే వేడుకలు)

కాగా దేశంలోని 718 లోజిల్లాలు.. 9 రాష్ట్రాల్లోని 230 జిల్లాల్లో ఇరవై ఒకటి హాట్ స్పాట్‌ కేంద్రాలుగా ప్రభుత్వం గుర్తించి ఆయా జిల్లాల్లో ఎట్టి పరిస్థితిలో సడలింపు ఇచ్చే అవకాశం లేదు. అందుకే రాజస్థాన్, మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో హాట్ స్పాట్‌లు ఎక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలో దశలవారిగా లాక్ డౌన్ సడలింపులు ఇవ్వనుంది కేంద్రం. 

ముందుగా కోవిడ్ కేసులు లేని జిల్లాలను మొదటి దశలో లాక్ డౌన్ ఎత్తివెయ్యనున్నారు. గుళ్లు, ఇతర బహిరంగ ప్రదేశాలు, సినిమా హాళ్లు మాత్రం ఇప్పట్లో తెరిసే పరిస్థితి మాత్రం లేదు. కేంద్రం చెబుతున్న ఈ వ్యూహాన్ని అనుసరించడానికి తెలుగు రాష్ట్రాలు కూడా అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తుంది. మహారాష్ట్రలో చాలా పట్టణ ప్రాంతాల్లో కొన్ని వారాల పాటు లాక్డౌన్ కొనసాగే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు నమోదు కాని జిల్లాలను లాక్ డైన్ నుంచి తప్పించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాని జిల్లాలు విజయనగరం, శ్రీకాకుళం.. ఈ రెండు జిల్లాల్లో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడంతో ఈ జిల్లాలకే రాష్ట్రంలో మొదటి దశలో సడలింపు ఉంటుందని భావిస్తున్నారు. 

అయితే సడలింపు ఇచ్చిన జిల్లాలకు పక్క జిల్లాల నుంచి ఎవ్వరినీ రాకుండా చూసేందుకు చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఆదేశాలు ఇచ్చింది కేంద్రం ఈ మేరకు లాక్ డౌన్ సడలించే జిల్లాల గురించి నివేదిక ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది కేంద్రం.