దేశమంతా ఒకటే రేషన్ కార్డు: కేంద్ర మంత్రి

కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ సోమవారం సంచలన ప్రకటన చేశారు. వన్ నేషన్, వన్ రేషన్ కార్డ్ స్కీంను మరో నాలుగు నెలల్లో అంటే జూన్ 1నుంచి దేశమంతా అమల్లోకి తీసుకురానున్నట్లు చెప్పాడు. ‘వన్ నేషన్, వన్ రేషన్ కార్డ్ స్కీంను జూన్ 1నుంచి దేశమంతా అమల్లోకి తీసుకువస్తాం. ఈ స్కీం కింద లబ్ధిదారుడు దేశమంతా ఒకేరేషన్ కార్డుతో ప్రయోజనాలు పొందగలడు’ అని పాశ్వాన్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు.
జనవరి 1కంటే ముందు న్యూ ఇయర్‌లోపే ఈ సదుపాయాలన్నీ 12రాష్ట్రాల్లో అమలవుతాయని పాశ్వాన్ చెప్పారు. ఈ సదుపాయం కింద 12 రాష్ట్రాల్లో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ రేషన్ తీసుకోవచ్చని అన్నారు. కేంద్ర మంత్రి తెలిపిన వివరాల ప్రకారం.. ఆహారం, పౌర సరఫరాల కోసం ఈ పథకం ఉపయోగపడుతుందని అన్నారు.
డిసెంబరు 3నుంచి పాశ్వాన్ ఈ వన్ నేషన్ వన్ రేషన్ కార్డు గురించి ప్రకటిస్తూనే ఉన్నారు. అంతేకాకుండా ఈ సిస్టమ్‌ను 2020 జూన్ 30నాటికల్లా అమలుచేస్తామని హామీలు ఇస్తామనే అన్నారు.