Single-Dose Covishield : కొవిషీల్డ్ సింగిల్ డోస్.. కరోనాను సమర్థవంతంగా అడ్డుకోగలదా?

సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) అభివృద్ధి చేసిన ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ కోవిషీల్డ్ ఒక మోతాదు కరోనావైరస్ నుంచి తగినంత రక్షణ ఇవ్వగలదా?

Single-Dose Covishield : కొవిషీల్డ్ సింగిల్ డోస్.. కరోనాను సమర్థవంతంగా అడ్డుకోగలదా?

Will Single Dose Covishield Give Enough Protection Against Covid 19 Govt Study To Find Out

Updated On : May 31, 2021 / 11:48 PM IST

Single-Dose Covishield : సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) అభివృద్ధి చేసిన ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ కొవిషీల్డ్ ఒక మోతాదు కరోనావైరస్ నుంచి తగినంత రక్షణ ఇవ్వగలదా? లేదా అనే దానిపై భారత ప్రభుత్వం ఒక అధ్యయనాన్ని ప్రారంభిస్తుందని ప్రభుత్వ అధికారి వెల్లడించారు. కొవిషీల్డ్ ఒక మోతాదు సమర్థతపై అధ్యయనం ఒక నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు.

నేషనల్ ఎథిక్స్ కమిటీ (ఆరోగ్య మంత్రిత్వ శాఖ క్రింద) నుంచి అనుమతి కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా, ఫైజర్-బయోఎంటెక్ టీకాలతో కూడిన మిక్స్-అండ్-మ్యాచ్ స్ట్రాటజీ పాల్గొనేవారిలో రోగనిరోధక శక్తిని పెంచుతుందని ఒక కొత్త అంతర్జాతీయ పరిశోధన సూచించింది.

ప్రస్తుతం భారతదేశంలో వాడుతున్న టీకాలన్నీ కొవిషీల్డ్, కొవాక్సిన్, రష్యాకు చెందిన స్పుత్నిక్ V రెండు-మోతాదు టీకాలు.. వీటితో మిక్స్-అండ్-మ్యాచ్ విధానానికి అనుమతి లేదు. ప్రభుత్వ నిపుణుల బృందం రెండు కొవిషీల్డ్ మోతాదుల మధ్య అంతరాన్ని మే నెలలో 12-16 వారాలకు విస్తరించే నిర్ణయం ప్రభావాన్ని కూడా సమీక్షించే అవకాశం ఉంది.

అంతకుముందు, సిఫార్సు చేసిన డోసుల గ్యాప్‌ను ఏప్రిల్‌లో నాలుగు-ఆరు వారాల నుంచి ఆరు-ఎనిమిది వారాలకు పెంచారు. సింగిల్-షాట్ కొవిషీల్డ్ టీకా సమర్థతపై ఈ అధ్యయనం, బూస్టర్ మోతాదు అవకాశాన్ని కూడా విశ్లేషించనుంది. అధ్యయనంలో డేటాను బట్టి మొదటి మోతాదు తర్వాత ఆరు నెలలు లేదా 12 నెలల తర్వాత ఇచ్చే అవకాశం ఉంటుంది.