Court Judgement: అత్యాచారం కేసులో 33 ఏళ్ల తర్వాత శిక్ష ఖరారు.
అత్యాచారం జరిగి 33 ఏళ్ళు అయింది.. ఈ ఘటనతో సంబంధం ఉన్న ఓ మహిళకు గురువారం శిక్ష పడింది. వివరాల్లోకి వెళితే 1988 జూన్ 30న ఉత్తరప్రదేశ్ శ్రావస్తికి చెందిన 12 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. ఈ అత్యాచారం ఓ మహిళ పాత్ర ఉందని భింగా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.

Court Judgement
Court Judgement: అత్యాచారం జరిగి 33 ఏళ్ళు అయింది.. ఈ ఘటనతో సంబంధం ఉన్న ఓ మహిళకు గురువారం శిక్ష పడింది. వివరాల్లోకి వెళితే 1988 జూన్ 30న ఉత్తరప్రదేశ్ శ్రావస్తికి చెందిన 12 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. ఈ అత్యాచారం ఓ మహిళ పాత్ర ఉందని భింగా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.
ఉత్తరప్రదేశ్ శ్రావస్తికి చెందిన బాధితురాలు సమీప గ్రామంలో ఓ విహానికి హాజరయ్యింది. రాత్రి సమయంలో తిరిగి ఇంటికి వస్తుండగా రామ్‌వతి, ఆమె తల్లి ఫూల్‌మాత మైనర్ బాలికను ముక్కు, పుస్సు, లాహ్రీ అనే ముగ్గురు వ్యక్తులకు అప్పగించారు. వారు సదరు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయాన్నీ బాలిక కుటుంబ సభ్యులకు చెప్పడంతో పోలీస్ లకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు.
ఆ కేసు 33 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది.. విచారణ సమయంలోనే నలుగురు నిందితులు మరణించారు. ప్రస్తుతం రామ్‌వతి ఒక్కరే ప్రాణాలతో ఉన్నారు. ఈ కేసులో శ్రావస్తి స్థానిక కోర్టు సెషన్స్ జడ్జి పరమేశ్వర్ ప్రసాద్ గురువారం నిందితురాలికి 15 వేల రూపాయల జరిమానా విధించినట్లు ప్రభుత్వ న్యాయవాది కేపీ సింగ్ తెలిపారు. కోర్టులో దీర్ఘకాలం పెండింగ్‌లో ఉన్న పురాతన కేసుల్లో ఇది ఒకటి అని సింగ్ అన్నారు.
33 సంవత్సరాల తరువాత, 2021 ఏప్రిల్‌లో కోర్టు వారందరినీ దోషులుగా గుర్తించి తన తీర్పును రిజర్వు చేసింది. గురువారం తీర్పు వెల్లడించింది