Woman Pours Acid On Man : పెళ్లి చేసుకోనన్నాడని.. యువకుడిపై యాసిడ్ పోసిన వివాహిత
n పెళ్లి చేసుకునేందుకు నిరాకరించిన ఓ యువకుడిపై ఇద్దరు పిల్లల తల్లి యాసిడ్ పోసింది. కేరళ రాష్ట్రంలోని ఇడుక్కి జిల్లాలో ఈ ఘటన జరిగింది. యాసిడ్ దాడిలో తీవ్రంగా గాయపడిన బాధిత యువకుడు

Woman Mother Of 2 Pours Acid On Man For Rejecting Her Marriage Proposal
Woman Pours Acid On Man పెళ్లి చేసుకునేందుకు నిరాకరించిన ఓ యువకుడిపై ఇద్దరు పిల్లల తల్లి యాసిడ్ పోసింది. కేరళ రాష్ట్రంలోని ఇడుక్కి జిల్లాలో ఈ ఘటన జరిగింది. యాసిడ్ దాడిలో తీవ్రంగా గాయపడిన బాధిత యువకుడు తిరువనంతపురంలోని మెడికల్ కాలేజీ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్నాడు.
పోలీసుల కథనం ప్రకారం..అరుణ్ కుమార్(28), ఇద్దరు పిల్లలకు తల్లి అయిన షీబా(35)కు ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. వీరి స్నేహం క్రమంగా ముదిరింది. ఈ నేపథ్యంలో తనను పెళ్లి చేసుకోమని అరుణ్‌కు.. షీబా ప్రపోజ్ చేసింది. అయితే షీబాకు ఇది వరకే పెండ్లి అయ్యిందని, ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్లు అరుణ్‌కు తెలిసింది. దీంతో ఆమెతో స్నేహానికి ముగింపు పలికి మరో యువతిని పెళ్లి చేసుకోవాలని అరుణ్ భావించాడు. విషయం తెలిసుకున్న షీబా కుమార్‌కు ఫోన్ చేసి మాట్లాడింది. పెళ్లి చేసుకుందామని ప్రాధేయపడింది. అందుకు అతడు నిరాకరించారు.
దీంతో షీబా.. డబ్బుల కోసం అతడిని బ్లాక్‌మెయిల్ చేసింది. ఈ క్రమంలో నెల 16న అరుణ్ కుమార్ తన బావ, స్నేహితుడితో కలిసి ఆదిమాలి సమీపంలోని చర్చికు వెళ్లాడు. షీబా డిమాండ్ చేసిన డబ్బులు ఇచ్చేందుకు ఆమెను అక్కడ కలిశాడు. అయితే పెండ్లి చేసుకునేందుకు నిరాకరించిన అరుణ్ ముఖంపై షీబా యాసిడ్ పోసింది. దీంతో అతడి ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి.
అరుణ్ తొలుత ఆదిమాలిలోని ప్రైవేట్ హాస్పిటల్ లో చేరారు. అనంతరం తిరువనంతపురం మెడికల్ కాలేజీ హాస్పిటల్ కి అతడిని తరలించారు. యాసిడ్ దాడి వల్ల అరుణ్ కంటిచూపు పోయే ప్రమాదం ఉందని డాక్టర్లు తెలిపారు. కాగా, అరుణ్‌పై యాసిడ్ పోసిన షీబా ముఖం, శరీరంపైనా యాసిడ్ పడటంతో ఆమెకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. అయితే ఇదంతా చర్చిలో ఉన్న సీసీటీవీలో రికార్డైంది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి షీబాను శనివారం అరెస్ట్ చేశారు.
ALSO READ Virata Parvam: ఓటీటీ డీల్ క్యాన్సిల్.. ప్లాన్ ఎందుకు మారింది?