మహారాష్ట్రలో దారుణ ఘటన.. ఆగిఉన్న బస్సులోకి యువతిని తీసుకెళ్లి..

మహారాష్ట్రలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పుణెలోని స్వర్గేట్ బస్ స్టేషన్ లో ఆగిఉన్న బస్సులోకి ..

మహారాష్ట్రలో దారుణ ఘటన.. ఆగిఉన్న బస్సులోకి యువతిని తీసుకెళ్లి..

bus

Updated On : February 27, 2025 / 9:28 AM IST

Maharashtra: మహారాష్ట్రలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పుణెలోని స్వర్గేట్ బస్ స్టేషన్ లో ఆగిఉన్న బస్సులోకి 26యేళ్ల యువతిపై అత్యాచారం జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, హత్యాచారంకు పాల్పడింది దత్తాత్రేయ రాందాస్ గా గుర్తించిన పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.

Also Read: Posani Krishna Murali Arrest : పోసాని అరెస్ట్ దారుణం, కూటమి ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదు- వైసీపీ నేతల వార్నింగ్

సతారా జిల్లాలోని ఫల్తాన్ గ్రామానికి చెందిన యువతి ఓ ఆస్పత్రిలో కౌన్సెలర్ గా పనిచేస్తుంది. దీంతో ఆ యువతి విధులకు వెళ్లే నిమిత్తం ఉదయం 6గంటల సమయంలో స్వర్గేట్ బస్టాండ్ కు చేరుకుంది. దత్తాత్రేయ రాందాస్ అనే వ్యక్తి ఆ యువతి వద్దకు వచ్చి ఫల్తాన్ కు వెళ్లే బస్సు మరో ప్లాట్ ఫామ్ పై ఆగిఉందని చెప్పడంతో.. నిజమేనని నమ్మిన యువతి అతని వెంట వెళ్లింది. జన సంచారం లేని ప్రదేశంలో ఆగిఉన్న బస్సు వద్దకు ఆ యువతిని తీసుకెళ్లాడు. దీంతో ఎవరూ లేరని యువతి రాందాస్ ను ప్రశ్నించగా.. బస్సు లోపల అందరూ పడుకున్నారని నమ్మించాడు.

Also Read: SLBC Rescue Operation : రెండు రోజుల్లో పూర్తి..! ఎస్‌ఎల్‌బీసీ రెస్క్యూ ఆపరేషన్ పై మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు

దత్తాత్రేయ రాందాస్ మాటలను నమ్మిన యువతి బస్సు ఎక్కింది. వెంటనే అతను బస్సు డోర్ వేసి ఆ యువతిపై అత్యాచారంకు పాల్పడ్డాడు. వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలు విషయాన్ని స్నేహితురాలికి చెప్పగా.. ఆమె సహాయంతో స్వర్గేట్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. బస్టాండ్ లోని సీసీ టీవీ పుటేజ్ ను పరిశీలించి నిందితుడు దత్తాత్రేయ రాందాస్ గా గుర్తించారు. గతంలో అతనిపై పలు పోలీస్ స్టేషన్ లో దొంగతనం కేసులు నమోదయ్యాయి. నిందితుడిని అరెస్టు చేసేందుకు ఎనిమిది పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు.