Cyber Fraud : పార్ట్ టైమ్ జాబ్ ఆఫర్ పేరుతో ఘరానా మోసం.. ఇన్ స్టాగ్రామ్ యాడ్ పై క్లిక్ చేసి రూ.10లక్షలకుపైగా పోగొట్టుకున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగిని

పార్ట్ టైమ్ జాబ్ ఆఫర్ తో కూడిన ఇన్ స్టాగ్రామ్ యాడ్ ను క్లిక్ చేయడం ద్వారా మహిళా సాఫ్ట్ వేర్ ఉద్యోగి స్కామర్ల చేతిలో మోసపోయారు. యాడ్ లో ఇచ్చిన వాట్సాప్ నెంబర్ ను మహిళా సాఫ్ట్ వేర్ ఉద్యోగి సంప్రదించగా ఆపై టెలిగ్రామ్ లింక్ పంపారు.

Cyber Fraud : పార్ట్ టైమ్ జాబ్ ఆఫర్ పేరుతో ఘరానా మోసం.. ఇన్ స్టాగ్రామ్ యాడ్ పై క్లిక్ చేసి రూ.10లక్షలకుపైగా పోగొట్టుకున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగిని

Cyber Fraud (1)

Updated On : August 21, 2023 / 3:09 PM IST

Cyber Fraud Woman Software Employee : దేశంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. సైబర్ నేరగాళ్లు ఆన్ లైన్ అడ్డగా భారీగా మోసాలకు పాల్పడుతున్నారు. పార్ట్ టైమ్ జాబ్ ఆఫర్ పేరుతో అమాయకులను మోసం చేస్తున్నారు. అమాయకులను నిలువునా దోచేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే కర్ణాటకలో చోటు చేసుకుంది. బెంగళూరుకు చెందిన మహిళా సాఫ్ట్ వేర్ ఉద్యోగి స్కామర్లు రూ.10.5 లక్షలకు ముంచేశారు.

పార్ట్ టైమ్ జాబ్ ఆఫర్ తో కూడిన ఇన్ స్టాగ్రామ్ యాడ్ ను క్లిక్ చేయడం ద్వారా మహిళా సాఫ్ట్ వేర్ ఉద్యోగి స్కామర్ల చేతిలో మోసపోయారు. యాడ్ లో ఇచ్చిన వాట్సాప్ నెంబర్ ను మహిళా సాఫ్ట్ వేర్ ఉద్యోగి సంప్రదించగా ఆపై టెలిగ్రామ్ లింక్ పంపారు. యాప్ ను డౌన్ లోడ్ చేసుకోని సదరు వ్యక్తిని సంప్రదించగా పెట్టుబడులపై 30 శాతం రిటన్స్ ఇస్తామని నమ్మబలికారు.

Cyber Fraud : ఎన్టీఆర్ జిల్లాలో భారీ సైబర్ మోసం.. అకౌంట్ల నుంచి రూ.3 కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు

దీంతో బాధితురాలు గూగుల్ పే ద్వారా రూ.7 వేలు పంపిన కొద్ది సేపటికే ఆమె ఖాతాలో రూ.9,100 డిపాజిట్ అయ్యాయి. బాధితురాలుకు స్కామర్లపై నమ్మకం కలగడంతో నిందితులు చెప్పినట్టే భారీ మొత్తాల్లో పెట్టుబడి పెట్టారు. ఆపై మహిళా సాఫ్ట్ వేర్ ఉద్యోగి రూ.10.5 లక్షలు స్కామర్లకు పంపారు.

అనంతరం స్కామర్ల నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన మహిళా సాఫ్ట్ వేర్ ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.