నీటి కోసం 60 అడుగుల లోతు బావిలోకి దిగిన మహిళ

గుక్కెడు నీళ్లకోసం ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవడం అక్కడివారికి అలవాటుగా మారిపోయింది. ఇంటిళ్లపాదీ గొంతు తడుపుకోవాలంటే ఆ ఇంటి మహిళ ప్రాణాలకు తెగించి ఆ బావిలోకి దిగాల్సిన పరిస్థితి అక్కడ నిత్యకృత్యమయిపోయింది. లేదంటే దాహం దాహం అన్న కేకలు విని కూడా మౌనంగా ఉండిపోవాల్సిన దుస్థితి వారిది. అందుకే 60 అడుగుల లోతున్న బావిలో ప్రతీరోజూ ఫీట్లు చేస్తూ నీటిని తీసుకువెళ్తారు. హృదయాన్ని కదిలించే దృశ్యం మహరాష్ట్ర నాసిక్‌లోని బర్దివాడిలో ప్రతీరోజూ కనిపిస్తూ ఎందరినో ఆలోచింపచేస్తుంది.