Marriage Cancel: వధువు ముఖానికి వెరైటీ మేకప్.. పెళ్లివద్దంటూ వెళ్లిపోయిన వరుడు

ఓ వధువు పెళ్లికి ముందు తన ముఖానికి వెరైటీ మేకప్ వేయించుకుంది. ఆ తరువాత ఆమెను చూసిన వరుడు ఈమెతో పెళ్లి నాకొద్దంటూ రద్దు చేసుకొని వెళ్లిపోయాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని హసన్ జిల్లా అరసికరె గ్రామంలో చోటు చేసుకుంది.

Marriage Cancel: వధువు ముఖానికి వెరైటీ మేకప్.. పెళ్లివద్దంటూ వెళ్లిపోయిన వరుడు

Wedding Cancel

Updated On : March 4, 2023 / 12:00 PM IST

Marriage Cancel: మహిళలు అందంగా కనిపించేందుకు బ్యూటీ ప్లార్లర్లకు వెళ్లి మేకప్ వేయించుకుంటారు. ఇక, శుభకార్యాలు, పెళ్లిళ్లు సమయంలో వెరైటీ మేకప్‌లతో అందంగా కనిపిస్తుంటారు. ఇదే తరహాలో ఓ వధువు పెళ్లికి ముందు తన ముఖానికి వెరైటీ మేకప్ వేయించుకుంది. ఆ తరువాత ఆమెను చూసిన వరుడు ఈమెతో పెళ్లి నాకొద్దంటూ రద్దు చేసుకొని వెళ్లిపోయాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని హసన్ జిల్లా అరసికరె గ్రామంలో చోటు చేసుకుంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావటంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Marriage Cancel : షాంపూ కారణంగా పెళ్లి రద్దు

హసన్ జిల్లా అరసికరె గ్రామానికి చెందిన ఓ యువతికి ఇటీవల పెళ్లి నిశ్చయమైంది. పెళ్లికి ముందు నిశ్చతార్ధం కార్యక్రమంలో వధువు, వరుడు పెళ్లి ఫొటోలతో సందడి చేశారు. పెళ్లికి పదిరోజుల సమయం ఉండగా వధువు బ్యూటీ పార్లర్‌కు వెళ్లింది. ముఖం అందంగా కనిపించాలనే ఉద్దేశంతో కొత్తరకం మేకప్ ట్రై చేసేందుకు సిద్ధమైంది. బ్యూటీషియన్ మేకప్ కు ముందు ముఖానికి ఫౌండేషన్ రాసి ఆ తరువాత ఆవిరి పట్టింది. దీంతో ముఖం కాలిపోయి బొబ్బలెక్కింది. ముఖం నిండా బొబ్బలు వచ్చి వధువు అంద వికారంగా మారిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం వధువు ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతుంది.

Wedding Insurance: పెళ్లి క్యాన్సిల్ అయిందా?రూ.10 లక్షలు పరిహారం ఇస్తామంటున్న ఇన్సూరెన్స్ కంపెనీలు..

యువతికి ఆరోగ్యం మెరుగ్గా ఉన్నప్పటికీ.. ముఖం వాపు వచ్చి అంధవికారంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న వరుడు ఆస్పత్రికి వెళ్లి వధువును పరామర్శించాడు. ఆమె గుర్తుపట్టలేని స్థితిలో ఉండటం, ముఖం అందహీనంగా మారడంతో పెళ్లి వాయిదా వేసుకున్నారు. రెండురోజుల తరువాత తనకు ఈ పెళ్లి వద్దంటూ క్యాన్సిల్ చేసుకున్నాడు. అయితే, వధువు ముఖం అందవికారంగా మారడానికి కారణమైన బ్యూటీషియన్‌ను వధువు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.