Mumbai : పోగొట్టుకున్న ఐ ఫోన్ తిరిగి ఆ మహిళ చేతికి ఎలా వచ్చిందంటే?

ఫోన్ పోతే తిరిగి దొరకడం అంటే లక్ ఉన్నట్లే. ముంబయిలో ఓ మహిళ తన ఐ ఫోన్ పోగొట్టుకుంది. తిరిగి ఎలా పొందగలిగిందో ట్వీట్ చేసింది. ఆమె ఫోన్ తిరిగి ఇచ్చిన వారిపై నెటిజన్లు ప్రసంశలు కురిపిస్తున్నారు.

Mumbai : పోగొట్టుకున్న ఐ ఫోన్ తిరిగి ఆ మహిళ చేతికి ఎలా వచ్చిందంటే?

Mumbai

Updated On : July 4, 2023 / 1:30 PM IST

Mumbai : ఫోన్ ఫోగొట్టుకుంటే ఇక దొరికినట్లే.. ఇది చాలామంది నోటి వెంట వచ్చే మాట. కొందరి అనుభవాల్లోంచి వచ్చే మాట. అయితే ముంబయిలో ఐ ఫోన్ పోగొట్టుకున్న ఓ మహిళ తిరిగి దానిని పొందగలిగింది. ఎలా అంటే చదవండి.

Group-4 Exam : గ్రూప్-4 ఎగ్జామ్ లో సెల్ ఫోన్ తో పట్టుబడ్డ అభ్యర్థి.. కేసు నమోదు చేసిన పోలీసులు

బయట ఉన్నప్పుడు ఫోన్లు వస్తుంటాయి. బిజీగా మాట్లాడేసి ఏమరుపాటుగా ఏ పక్కనో పెట్టేస్తాం. లేదంటే హ్యాండ్ బ్యాగ్స్ నుంచి, జేబుల్లోంచి సెల్ ఫోన్లు జారి కిందపడిపోయిన సందర్భాలు ఉంటాయి. అలా పోగొట్టుకుని పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ ఇచ్చినా తిరిగి దొరికిన సందర్భాలు అరుదుగా ఉంటాయి. ఇటీవల ముంబయిలో ఓ మహిళ తన పోగొట్టుకున్న ఐఫోన్ తిరిగి పొందడానికి ఆటో డ్రైవర్, స్విగ్గీ ఫుడ్ డెలివరీ ఏజెంట్ ఎలా సాయం చేసారో సుదీర్ఘమైన తన ట్వీట్ల ద్వారా పంచుకున్నారు.

 

Historywali అనే ట్విట్టర్ యూజర్  తన ఐఫోన్ 12 మినీ ఆటోలో పోగొట్టుకున్నారు. ఇక ఐ ఫోన్ పోగానే పరిస్థితి ఎలా ఉంటుంది? తీవ్ర ఆందోళనలో ఉన్న ఆమె తాను ఆటో ఎక్కిన ఆటో స్టాండ్ వైపు పరుగులు తీసింది. అక్కడ ఉన్నచాలామంది ఆటోడ్రైవర్ల సాయంతో తిరిగి తన ఫోన్ పొందగలిగింది. రాహుల్ కుమార్ అనే స్విగ్గీ ఫుడ్ డెలివరీ ఏజెంట్, నీలేష్ అనే ఆటో డ్రైవర్ ద్వారా తను ఏ ఆటోలో అయితే ఫోన్ పోగొట్టుకుందో తిరిగి పొందగలింది. వారిందరికీ ధన్యవాదాలు చెప్పింది.

Jio Bharat Phone : ఇంటర్నెట్ ఎనేబుల్డ్ ‘జియోభారత్’ ఫోన్‌ వచ్చేసిందోచ్.. కేవలం రూ. 999 మాత్రమే.. త్వరపడండి..!

ఆమె చేసిన ట్వీట్లు ముంబయిలో చాలామంది తాము అనుభవాలను షేర్ చేసుకోవడానికి స్ఫూర్తి కలిగించాయి. చాలామంది ఆమె ట్వీట్‌పై స్పందిస్తూ తమ అనుభవాలను షేర్ చేసుకున్నారు. నిజంగానే పోగొట్టుకున్న వస్తువుల్ని తిరిగి ఇవ్వడమనే మంచి మనస్తత్వం అందరిలో ఉంటే ఎంత బాగుంటుందో అని అందరూ అభిప్రాయపడ్డారు.