Women Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లులోని ముఖ్యమైన అంశాలు ఏమిటి..? పార్లమెంటు, అసెంబ్లీలో ఎలాంటి మార్పులుంటాయి

మహిళా రిజర్వేషన్ బిల్లులోని అంశాలు కేవలం లోక్‌సభ, అసెంబ్లీకు మాత్రమే వర్తిస్తాయి. రాజ్యసభ, శాసన మండలి వ్యవస్థ‌ల్లో వర్తించదు.

Women Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లులోని ముఖ్యమైన అంశాలు ఏమిటి..? పార్లమెంటు, అసెంబ్లీలో ఎలాంటి మార్పులుంటాయి

Women Reservation Bill

Updated On : September 21, 2023 / 9:14 AM IST

Women Reservation Bill 2023: చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ల బిల్లుకు బుధవారం లోక్ సభ ఆమోదం తెలిపింది. దాదాపు ఎనిమిది గంటలపాటు జరిగిన చర్చ అనంతరం పార్లమెంట్ లో ఈ బిల్లుపై ఓటింగ్ జరిగింది. ఈ ఓటింగ్ లో 454 మంది సభ్యులు మహిళా బిల్లుకు ఆమోదం తెలుపుతూ ఓటింగ్ వేయగా.. ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఆ పార్టీ ఔరంగాబాద్ ఎంపీ సయ్యద్ ఇంతియాజ్ జలీల్ వ్యతిరేకంగా ఓటు వేశారు. ఈ బిల్లుపై గురువారం రాజ్యసభలో చర్చ జరగనుంది. ఇక్కడ ఆమోదం లాంఛనమే. అయితే, బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందితే లోక్‌సభతో పాటు అసెంబ్లీలో ఈ బిల్లు వల్ల 33శాతం కోటా మహిళలకు దక్కనుంది.

Women Reservation Bill

Women Reservation Bill

Read Also : Women Reservation Bill: 2024 ఎన్నికల తరువాతనే ఆ ప్రక్రియ మొదలవుతుంది.. మహిళా రిజర్వేషన్ బిల్లుపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

మహిళా రిజర్వేషన్ బిల్లుకు ‘నారీ శక్తి వందన్ చట్టం’ అని పేరు పెట్టారు. ఈ బిల్లు అమల్లోకి వచ్చిన తరువాత లోక్ సభ, అసెంబ్లీలలో మొత్తం సీట్లలో 33శాతం మహిళలకు రిజర్వ్ చేసేలా నిబంధన ఉంది. అంటే ప్రతీ లోక్‌సభ, అసెంబ్లీలో ముగ్గురిలో ఒక మహిళ ఉంటారు. నారీ శక్తి వందన్ చట్టం బిల్లులోని నిబంధనల ప్రకారం.. లోక్ సభలోని 543 సీట్లలో 181 సీట్లు మహిళలకు రిజర్వ్ చేయబడతాయి. ప్రస్తుతం 82 మంది మహిళలు మాత్రమే ఎంపీలుగా ఉన్నారు. బిల్లు అమల్లోకి వస్తే వీరి ప్రాతినిధ్యం పెరుగుతుంది.

PM Narendra Modi

PM Narendra Modi

మహిళలకు 33శాతం రిజర్వేషన్లు అమలైతే.. ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి ఇప్పటికే రిజర్వ్ చేసిన సీట్లలో ఇప్పుడు 33శాతం మహిళలకు రిజర్వ్ చేయబడుతుంది. ఉదాహరణకు.. లోక్ సభలో 84 సీట్లు ఎస్సీకి, 47 సీట్లు ఎస్టీకి రిజర్వ్ చేయబడ్డాయి. ఈ బిల్లు చట్టంగా మారితే.. 84 ఎస్సీ సీట్లలో 28 సీట్లు మహిళలకు రిజర్వ్ చేయబడతాయి. అదేవిధంగా 47 ఎస్టీ సీట్లలో 16 ఎస్టీ సీట్లు మహిళలకు రిజర్వ్ చేయబడతాయి. మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రకారం.. మహిళలకు రిజర్వు చేసిన స్థానాల్లోనేకాక రిజర్వ్ చేయని స్థానాల్లోనూ పోటీచేసుకునే అవకాశం ఉంది.

Read Also : Women Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుకు లోక్‌సభలో ఆమోదం

మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీ మహిళలకు ప్రత్యేకంగా రిజర్వేషన్లు ఏమీ లేవు. ఈ బిల్లులోని అంశాలు కేవలం లోక్‌సభ, అసెంబ్లీకు మాత్రమే వర్తిస్తాయి. రాజ్యసభ, శాసన మండలి వ్యవస్థ ఉన్న రాష్ట్రాల్లో వర్తించదు.ఇదిలాఉంటే తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుం ఉన్న అసెంబ్లీ సీట్ల లెక్క ప్రకారం.. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకుగాను మహిళా రిజర్వేషన్ బిల్లు అమలయితే సుమారు 58 స్థానాల్లో మహిళలకు రిజర్వ్ చేయబడతాయి. తెలంగాణ రాష్ట్రంలో 119 అసెంబ్లీ స్థానాలకు సుమారు 40 స్థానాలు మహిళలకు రిజర్వు చేయబడతాయి.