పర్యటించండి…ఉద్యోగాలు పొందండి : హ్యాపీ వరల్డ్ టూరిజం డే

  • Published By: venkaiahnaidu ,Published On : September 27, 2019 / 09:46 AM IST
పర్యటించండి…ఉద్యోగాలు పొందండి : హ్యాపీ వరల్డ్ టూరిజం డే

Updated On : September 27, 2019 / 9:46 AM IST

పర్యాటక ప్రేమికులందరికీ పర్యాటక దినోత్సవ శుభాకాంక్షలు. ఇవాళ(సెప్టెంబర్-27,2019)ప్రపంచ పర్యాటక దినోత్సవం. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని జరుపుకోవడం యొక్క ఉద్దేశ్యం.. ప్రపంచవ్యాప్తంగా పర్యాటక పాత్ర గురించి అవగాహన పెంచడం, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ మరియు ఆర్థిక విలువలను ప్రోత్సహించడం. యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ వారు మొదటిసారిగా 1980లో ‘ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని’ సెప్టెంబర్ 27న నిర్వహించడం ప్రారంభించారు. అప్పట్నుంచీ ఒక్కో సంవత్సరం ఒక్కో కాన్సప్ట్‌తో నిర్వహిస్తున్నారు. 1980లో ‘టూరిజం కంట్రిబ్యూషన్ టు ది ప్రిజర్వేషన్ ఆఫ్ కల్చరల్ హెరిటేజ్ అండ్ టు పీస్ అండ్ మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ అని పేరు పెట్టారు.

ఇలా ప్రతి ఏడాది ఒక్కో అంశాన్ని తీసుకుని టూరిజం పట్ల పర్యాటకుల్లో ఆసక్తిని కలిగించడమే కాకుండా ఆయా చారిత్రక విషయాలను పదిలపరచుకోడానికి ఒక అవకాశంగా తీసుకుంటున్నారు. 2014లో ప్రపంచ పర్యాటక దినోత్సవం థీమ్… ‘టూరిజం అండ్ కమ్యూనిటీ డెవెలప్‌మెంట్‌గా ఉండేది.  కాగా, ప్రపంచ మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో 2015లో యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవెలప్‌మెంట్‌ గోల్స్‌పై దృష్టి సారించింది. ఈసారి ప్రపంచ పర్యాటక దినోత్సవం థీమ్.. “పర్యాటకం మరియు ఉద్యోగాలు: అందరికీ మంచి భవిష్యత్తు”. అంతేకాకుండా ఈ రోజున అనేక టూరిజం ఆర్గనైజేషన్స్ ప్రజలను ఆకర్షించేందుకు వివిధ రకాల కాంపిటీషన్స్‌ను నిర్వహిస్తారు. ఫ్రీ ఎంట్రీస్, డిస్కౌంట్స్, స్పెషల్ ఆఫర్స్‌తో జనాలను పర్యాటక రంగం వైపు దృష్టి సారించేలా చేస్తారు. ఈ సంవత్సరం భారతదేశం 2019 ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని నిర్వహిస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా పర్యాటక రంగం ఎంతో అభివృద్ధి చెందుతూ వస్తోంది. ఎన్నో అపురూపమైన, అందమైన డెస్టినేషన్ ప్లేస్స్ పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అందువల్లే అభివృద్ధి చెందుతున్న దేశాలకు టూరిజం ఎక్కువ ఆదాయం తెచ్చిపెడుతోంది. భారత్ కూడా కొన్నేళ్లుగా టూరిజంను బాగా ప్రోత్సహిస్తూ మంచి ఆదాయాన్ని సమకూర్చుకుంటోంది.