CAA, NRC, NPRపై యశ్వంత్ సిన్హా యాత్ర

  • Published By: madhu ,Published On : January 5, 2020 / 02:08 AM IST
CAA, NRC, NPRపై యశ్వంత్ సిన్హా యాత్ర

Updated On : January 5, 2020 / 2:08 AM IST

కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా యాత్ర చేపట్టబోతున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన CAA, NRC, NPR చట్టాలను వ్యతిరేకిస్తూ ఆరు రాష్ట్రాల్లో రాష్ట్ర మంచ్ ఆధ్వర్యంలో గాంధీ శాంతి యాత్ర జరుగనుందని ఆయన స్వయంగా వెల్లడించారు. మాజీ ఎంపీ శతృఘ్నసిన్హా, గుజరాత్ మాజీ సీఎం సురేశ్ మెహతాతో కలిసి ఆయన 2020, జనవరి 04వ తేదీ శనివారం మీడియాతో మాట్లాడారు. జనవరి 09వ తేదీ ముంబైలోని అపోలో బందర్ నుంచి యాత్ర స్టార్ట్ కానుందని తెలిపారు. జనవరి 30వ తేదీన గాంధీజీ వర్ధంతి రోజు..ఢిల్లీలోని రాజ్ ఘాట్ వద్ద యాత్ర ముగుస్తుందన్నారు. 

మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా, గుజరాత్, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ యాత్ర కొనసాగుతుందన్నారు. మొత్తం 3 వేల కిలోమీటర్ల సాగుతుందన్నారు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఆందోళనకారులపై పోలీసుల వ్యవహార శైలిని ఆయన ఖండించారు. ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదంగా అభివర్ణించారు. 

కేంద్రం తీసుకొచ్చిన ఈ చట్టాలపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు పెల్లుబికాయి. ఢిల్లీ, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా ఢిల్లీలోని జామియా మిలియా వర్సిటీ రణరంగంగా మారింది. డిసెంబర్ 15వ తేదీ ఆదివారం వర్సిటీలోని కలింది కూంజ్ రోడ్ వద్ద భారీగా ఆందోళనలు కారులు తరలివచ్చారు. ఇందులో విద్యార్థులు కూడా ఉన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళనల నేపథ్యంలో జామియా మిలియా ఇస్లామియా వర్సిటీ ఈనెల 16 నుంచి జనవరి 5వ తేదీ వరకు సెలవులు ప్రకటించింది. పలు పరీక్షలను కూడా వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. 

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు..క్రమ క్రమంగా వర్సిటీలకు పాకాయి. ఢిల్లీలోని JNU, జామియా, ఢిల్లీ యూనివర్సిటీ, కోల్ కతా జాదవ్ యూనివర్సిటీ, వారణాసిలోని బనారస్ హిందూ వర్సిటీ, యూపీలోని ఆలీఘడ్ ముస్లిం వర్సిటీ, దక్షిణాది ప్రాంతంలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, మౌలానా ఆజాద్ ఉర్దూ వర్సిటీలో ఆందోళనలు పెల్లుబికాయి. 

Read More : CAAపై రగడ : బాలీవుడ్‌ స్టార్స్, నిర్మాతలకు మోడీ ప్రభుత్వం ఆహ్వానం