TikTok పట్టించింది : టీ అమ్ముతున్న సీఎం యోగి డూప్

ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను పోలి ఉన్న వ్యక్తి టీ అమ్ముతున్న ఫొటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

  • Published By: venkaiahnaidu ,Published On : February 15, 2019 / 09:35 AM IST
TikTok పట్టించింది : టీ అమ్ముతున్న సీఎం యోగి డూప్

Updated On : February 15, 2019 / 9:35 AM IST

ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను పోలి ఉన్న వ్యక్తి టీ అమ్ముతున్న ఫొటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను పోలి ఉన్న వ్యక్తి టీ అమ్ముతున్న ఫొటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. నీలం చతుర్వేది అనే వ్యక్తి ఫేస్‌బుక్‌లో ‘ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తమ్ముడు టీ అమ్ముతున్నాడు. కాంగ్రెస్ నేతల తమ్ముళ్లు ఎవరైనా ఇలాగే టీ అమ్మేవాళ్లు ఉంటే పోస్టు చేయండి’ ఇలా పోస్టు చేశాడు. క్షణాల్లోనే ఫొటో వైరల్‌గా మారింది. 11వేల మంది వరకూ షేర్ అయిన తర్వాత విషయం తెలుసుకున్న ఇంగ్లీషు మీడియా దానిపై నిజాలు తెలుసుకునేందుకు విచారణ చేపట్టింది. 

ఈ విషయం తెలుసుకోవడానికి ముందుగా యోగి ఆదిత్యనాథ్ సోదరి శశి సింగ్‌ను కలవాలనుకున్నారు. ఈ క్రమంలో ఆమె భర్త పురాణ్ పాయల్‌ను కలుసుకుని విచారించడంతో ఇలాచెప్పారు. యోగికి ముగ్గురు సోదరులు, ముగ్గురు అక్కా చెల్లెల్లు ఉన్నారు. వారిలో ఎవ్వరూ టీ అమ్మే షాప్ నడిపించడం లేదని నిర్దారించారు. 

ఆ తర్వాత తెలిసిన వివరాలను బట్టి ఇద్దరు సోదరులు ఓ ఇంటర్వ్యూలో కనిపించగా, మూడో వ్యక్తి ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నట్లు తెలిసింది. అయితే ఆ వ్యక్తి మాత్రం యోగికి సంబంధించిన వారు కాదు కానీ, నిజానికి అతనెవరో తెలియరాలేదని ఆ ఇంగ్లీషు మీడియా చెప్పుకొచ్చింది. 

Also Read : TikTok పట్టించింది : టీ అమ్ముతున్న సీఎం యోగి డూప్

Also Read : వన్ నేషన్ – వన్ నెంబర్ : 112 గుర్తుపెట్టుకుంటే చాలు

Also Read : వెరీ చీప్ : జియో 4జీ డేటా ప్లాన్ వోచర్లు ఇవే