Viral Video : వారేవా.. కుటుంబ సభ్యుల్ని ఫోన్ అడిక్షన్ నుండి బయటపడేయటానికి ఓ మహిళ తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా?

సెల్ ఫోన్‌కి అడిక్ట్ అయిన తన కుటుంబ సభ్యులను ఆ అడిక్షన్ నుండి బయటపడేయటానికి ఓ మహిళ పరిష్కారం కనిపెట్టింది. అందుకోసం ఆమె ఏం చేసిందంటే?

Viral Video : వారేవా.. కుటుంబ సభ్యుల్ని ఫోన్ అడిక్షన్ నుండి బయటపడేయటానికి ఓ మహిళ తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా?

Viral Post

Updated On : January 5, 2024 / 3:06 PM IST

Viral Post : తింటున్నా.. నడుస్తున్నా..బస్సెక్కినా.. ఆఖరికి రోడ్డు దాటుతున్నా.. చేతిలో సెల్ ఫోన్ చూసుకునే వాళ్లు ఎక్కువైపోయారు. ఫ్యామిలీ మెంబర్స్‌తో  ఉన్న కాసేపు ఫోన్‌లకు అతుక్కుపోతున్నారు. తన కుటుంబాన్ని ఈ వ్యసనం నుండి బయటపడేయటానికి ఓ మహిళ పరిష్కారం కనిపెట్టింది. ఆమె నిర్ణయం విచిత్రంగా అనిపించినా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Viral Post 1

Viral Post 1

zomato Food Delivery Boy : గుర్రంపై ఆర్డర్లు డెలివరీ చేస్తున్న జొమాటో డెలివరీ బాయ్.. రూ.10వేల సహాయం చేసిన ఎంబీటీ ప్రతినిధి.. వీడియో వైరల్

సెల్ ఫోన్ లేకపోతే బ్రతకలేని పరిస్థితికి వచ్చేసారు చాలామంది. కాసేపు ఫోన్ పనిచేయకపోతే విపరీతమైన ఆందోళన, ఒత్తిడికి గురయ్యే పరిస్థితిలో ఉన్నారు. సెల్ ఫోన్ ఉంటే చాలు పక్క వారితో పనిలేదు అన్నట్లుగా ఉంది మనుష్యుల తీరు. ఆఖరికి వాష్ రూమ్‌లోకి కూడా సెల్ ఫోన్ పట్టుకెళ్తున్నారంటే ఆలోచించాలి. ఈ పరిస్థితి నుండి తన కుటుంబాన్ని సరిచేసుకునేందుకు ఓ మహిళ పరిష్కారం కనిపెట్టింది. మంజు గుప్తా అనే మహిళ తన కుటుంబ సభ్యులతో ఒక ఒప్పందం చేసుకుంది.

మంజు గుప్తా నాన్-జుడీషియల్ స్టాంప్ పేపర్ మీద కుటుంబ సభ్యులందరితో సంతకాలు తీసుకుంది. ఆ పేపర్లో మూడు నియమాలు ఉన్నాయి. మొదటిది నిద్ర లేవగానే సూర్యుడిని చూడాలి తప్ప ఫోన్స్ చూడకూడదు. డైనింగ్ టేబుల్ దగ్గర కలిసి భోజనం చేయాలి.. ఆ టైమ్ లో చేతిలో సెల్ ఫోన్ ఉండకూడదు. మూడవది వాష్ రూమ్‌లో ఫోన్ ఉపయోగించకూడదు. . ఇక ఈ నియమాలు పాటించడంలో ఎవరైనా విఫలమైతే ఒక నెల పాటు స్విగ్గీ లేదా జొమాటో ద్వారా ఆహారాన్ని ఆర్డర్ చేయడానికి వీలు లేదు.

సారూ.. ఈ వయసులో బ్యాటింగ్ అవసరమా? బ్యాటింగ్ చేస్తూ బొక్కబోర్లా పడ్డ ఎమ్మెల్యే.. వీడియో వైరల్

ఈ ఒప్పందాన్ని మంజు గుప్తా ఏదో కోపంలో చేయలేదట. తన పిల్లలు తనను నెట్ ఫ్లిక్స్‌లో ‘ఖో గయే హమ్ కహాన్’ చూసేలా చేసినపుడు లైక్‌ల కోసం వారు వెర్రిగా మారారని ఆమె గ్రహించిందట. మంజు గుప్తా చేసుకున్న ఒప్పందం డాక్యుమెంటు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  ఆమె సరైన నిర్ణయం తీసుకుందని నెటిజన్లు కామెంట్స్ చేసారు.  విచిత్రంగా అనిపించినప్పటికీ సెల్ ఫోన్ అడిక్షన్ నుండి తన కుటుంబాన్ని బయట పడేయడానికి మంజు గుప్తా తీసుకున్న నిర్ణయాన్ని అందరూ అభినందించారు.