పాముతో పరాచకాలా : యువకుడి నుదిటిని పట్టి పీకేసింది!

  • Published By: sreehari ,Published On : September 25, 2019 / 07:48 AM IST
పాముతో పరాచకాలా : యువకుడి నుదిటిని పట్టి పీకేసింది!

Updated On : September 25, 2019 / 7:48 AM IST

పాములతో ఆటలు ఆడటం కామన్ అయిపోయింది. చాలామంది ప్రమాదమని తెలిసి కూడా విష సర్పాలతో పరాచకలాలడుతున్నారు. ఓ యువకుడు ఫేస్ బుక్ లైవ్ వీడియోలో భారీ పాముతో ఆటలాడాడు. పాము నోరు తెరిచి కాటేసేందుకు ప్రయత్నిస్తుంటే తప్పించుకుంటూ దాన్ని మరింత రెచ్చకొట్టాడు. ఒక వైపు కెమెరా వైపు చూస్తూ మరోవైపు పామును చేతిలో పట్టుకుని ఆడించాడు.

గోధుమ, వెండి రంగులో ఉన్న పాము అతడి తల నుదుటిపై కాటేసింది. గట్టిగా తన కత్తుల్లాంటి పదునైన పళ్లతో ఒడిసిపట్టేసింది. అతడి నుదిటిని గట్టిగా రక్కేసింది. యువకుడు ఎంత గింజుకున్నా పాము తన పట్టు వీడలేదు. పాము కాటుతో యువకుడు కెమెరా ముందే కుప్పకూలాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదుగానీ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇటీవలే ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ కు చెందిన మహిళ.. ఫోన్లో మాట్లాడుతూ వచ్చి తన బెడ్ పై ఉన్న పాములపై కూర్చొంది. పాములు కాటేయడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లి మృతిచెందింది. యువకుడిని పాము కాటేసిన వైరల్ వీడియో ఇదే..