Punjab : గన్‌తో బెదిరించి స్నేహితురాలిపై లైంగిక దాడి
లిఫ్ట్ ఇస్తానని నమ్మబలికి 22 ఏళ్ల యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు ఆమె స్నేహితుడు.. అనంతరం ఆమెను అక్కడే వదిలేసి పారిపోయాడు

Punjab
Panjab : లిఫ్ట్ ఇస్తానని నమ్మబలికి 22 ఏళ్ల యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు ఆమె స్నేహితుడు.. ఈ ఘటన పంజాబ్‌లోని మొహాలీ జిల్లా జిరక్‌పూర్‌లో గత నెల 29న జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అక్టోబర్ 29 రాత్రి బర్నాలా నుంచి మొహాలీ వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు వివరించారు. లగేజ్ ఎక్కువగా ఉండటంతో బస్టాప్ నుంచి తనను పికప్ చేసుకోవాలని తన స్నేహితుడు కుష్విందర్‌కు ఫోన్ చేసింది యువతి.
చదవండి : Thane Crime : చేప పెట్టిన చిచ్చు..బంధువును హత్య చేసిన 19 ఏళ్ళ యువకుడు
దీంతో కారు తీసుకోని వచ్చిన కుష్విందర్ రాత్రి 8గంటల సమయంలో యువతిని తీసుకోని వెళ్ళాడు. ఆమెను ఇంట్లో దించకుండా నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి గన్‌తో బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు.. అనంతరం అక్కడే వదిలిసే వెళ్ళిపోయాడు. క్యాబ్ సాయంతో ఇంటికి చేరుకున్న యువతి మరుసటిరోజు తన స్నేహితుడు కుష్విందర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
చదవండి : Gang Rape On Student : పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయి వాట్సప్‌కు అమ్మాయి నగ్న ఫోటోలు