Gang Rape On Student : పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయి వాట్సప్‌కు అమ్మాయి నగ్న ఫోటోలు ….

పెళ్లి చూపులయ్యాయి. అబ్బాయికి అమ్మాయి నచ్చింది. అమ్మాయికి అబ్బాయి నచ్చాడు.ఈలోగా  అబ్బాయినుంచి పిడుగులాంటి మెసేజ్  అమ్మాయికి వచ్చింది.అమ్మాయి నగ్న ఫోటోలు గుర్తు తెలియని నెంబర్ నుంచి

Gang Rape On Student : పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయి వాట్సప్‌కు అమ్మాయి నగ్న ఫోటోలు ….

Gang Rape On A Student

Gang Rape On Student :  పెళ్లి చూపులయ్యాయి. అబ్బాయికి అమ్మాయి నచ్చింది. అమ్మాయికి అబ్బాయి నచ్చాడు. ఇరువైపులా పెద్దలకు అన్ని విషయాలు  నచ్చాయి.  రేపో మాపో తాంబూలాలు పుచ్చుకుని ముహూర్తాలు పెట్టకుందామనుకుంటున్నారు. ఈలోగా  అబ్బాయినుంచి పిడుగులాంటి మెసేజ్  అమ్మాయికి వచ్చింది.

అమ్మాయి నగ్న ఫోటోలు గుర్తు తెలియని నెంబర్ నుంచి తన వాట్సప్ కు పంపించారని…. వాటిని అమ్మాయికి పంపించాడు. ఆఫోటోలు చూసిన అమ్మాయి షాక్ కు గురైంది. ఏం జరిగిందో తెలుసుకోటానికి ఎక్కువ సమయం పట్టలేదు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అస్సాం  రాజధాని దిబ్రూగఢ్‌ లో నివసించే  యువతి రోజూ కాలేజీకి  వెళ్లటానికి తన కజిన్ ఆర్యన్‌దాస్ బైక్ పై వెళ్లేది.   ఆరు నెలల క్రితం ఒకరోజు కాలేజీకి వెళ్తుంటే…. మార్గమధ్యలో   బైక్ చెడిపోయింది. వెంటనే అతను అదే కాలేజీలో చదివే తమ బంధువులైన పబిత్రా హజారికా, దేబాజిత్ దాస్ లకు  ఫోన్ చేసి వారి కారుతో తమను కూడా తీసుకువెళ్ళమని కోరాడు.

అదే దారిలో వెళుతున్న వారు, ఇద్దరినీ కారులో ఎక్కించుకుని కాలేజీకి బయలుదేరారు. కారులో ప్రయాణిస్తుండగా వారు యువతికి కూల్ డ్రింక్ ఆఫర్ చేశారు. యువతి ఆ కూల్ డ్రింక్ తాగింది. అనంతరం ఆమెకు  స్పృహ తప్పిపోయింది. కళ్లుతెరిచి చూసే సరికి తాను ఒక గదిలో ఉన్నట్లు గుర్తించింది. బయటకు వచ్చి చూస్తే తన క్లాస్‌మేట్ కజిన్ తో పాటు, కారులో వచ్చిన  వాళ్ల చుట్టాలబ్బాయిలైన మరో ఇద్దరు కూడా ఉన్నారు.

ఆమె అక్కడ ఎందుకు ఉందని వారిని ప్రశ్నించింది. ఏదో కీడు శంకించిన యువతి తనపై అత్యాచారం జరిగినట్లు తెలుసుకుంది. తన కజిన్ ను నిలదీసింది.  ఈవిషయం ఎవరికైనా చెపితే నీ తల్లి తండ్రులను చంపేస్తానవి బెదిరించారు.  బంధువే కదా ఏమీ చేయడనే ధీమాతో ఆ యువతి  ఆరు నెలలుగా మౌనంగా ఊరుకుంది.
Also Read : Air Hostess : ఎయిర్‌ హోస్టెస్‌ల అర్ధనగ్న నిరసనలు
se
ఇప్పుడు ఆయువతికి ఇంట్లో వాళ్లు పెళ్లి సంబంధాలు చూసి పెళ్లి చేయాలనుకున్నారు. ఒక వరుడుని చూసి అతనితో పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. దాదాపు సంబంధం ఖాయం అయిపోతున్న సమయంలో యువతి వద్దనుంచి పెళ్లి కొడుకు నెంబరు తెలుసుకున్న  కజిన్ ఆర్యన్‌దాస్  అతనికి యువతి నగ్నఫోటోలు పంపించటంతో ఈ వ్యవహారం బయటపడింది.

వెంటనే బాధిత యువతి  దిబ్రూగఢ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన దిబ్రూగఢ్‌ పోలీసులు నిందితులపై సామూహిక అత్యాచారం కింద కేసు నమోదు చేశారు. కేసులో మొదటి ముద్దాయి అయిన ఆర్యన్ దాస్ ను అదుపులోకి తీసుకున్నారు.  పరారీలో ఉన్న మిగిలిన ఇద్దరి కోసం గాలింపు చేపట్టామని దిబ్రూఘడ్ ఎస్పీ తెలిపారు.