Kedarnath temple : కేదార్‌నాథ్ ఆలయంలో ప్రియుడికి ప్రపోజ్ చేసిన యువతి .. ఆలయ పవిత్రత దెబ్బతింటోందని మండిపడుతున్న ప్రజలు

ప్రేమను వ్యక్తం చేయడానికి వేరే ప్రదేశమే దొరకలేదేమో ఆ యువతికి .. కేదార్‌నాథ్ ఆలయంలో తన ప్రియుడికి ప్రపోజ్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ కావడంతో పెద్ద చర్చ జరుగుతోంది.

Kedarnath temple : కేదార్‌నాథ్ ఆలయంలో ప్రియుడికి ప్రపోజ్ చేసిన యువతి .. ఆలయ పవిత్రత దెబ్బతింటోందని మండిపడుతున్న ప్రజలు

Kedarnath temple

Updated On : July 2, 2023 / 2:50 PM IST

Kedarnath temple : దేవాలయాల్లో కొన్ని నిబంధనలు అమలులో ఉన్నా యువత పట్టించుకోవట్లేదు.. వీడియోలు, రీల్స్ చేస్తూ వైరల్ అవ్వాలని ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఓ యువతి కేదార్‌నాథ్ ఆలయంలో తన ప్రియుడికి ప్రపోజ్ చేయడం పెద్ద చర్చకు దారి తీసింది.

Kedarnath Google Translate : కేదార్‌నాథ్‌లో తప్పిపోయిన ఏపీ మహిళ.. ఎట్టకేలకు కుటుంబంతో కలిపిన గూగుల్ ట్రాన్స్‌లేట్.. ఇంతకీ, వృద్ధురాలు ఎలా కలిసిందంటే?

తన ప్రియుడికి ఆలయంలో ప్రపోజ్ చేయాలనుకుందో.. వీడియో ద్వారా తాను వైరల్ అవ్వాలనుకుందో ఓ యువతి కేదార్‌నాథ్ ఆలయంలో తన ప్రియుడికి ప్రపోజ్ చేసింది. @Ravisutanjani అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో యువతీ, యువకులిద్దరూ పసుపురంగు దుస్తులు ధరించారు. యువతి తన మోకాలిపై కూర్చుని తన ప్రియుడికి ప్రపోజ్ చేసింది. ఇలాంటి సంఘటనల కారణంగానే ఆలయాల్లో, పుణ్యక్షేత్రాల్లో భక్తుల వెంట స్మార్ట్ ఫోన్లు అనుమతించబడట్లేదు. అయినా కూడా నిబంధనలకు విరుద్ధంగా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.

Kedarnath Dham: కేదార్‌నాథ్‌ ఆలయం గర్భగుడిలో శివలింగంపై కరెన్సీ నోట్లు.. వీడియో వైరల్.. మహిళపై కేసు నమోదు

ఈ వీడియో వైరల్ ‌మారడంతో ట్విట్టర్ యూజర్లు పెద్ద చర్చ పెట్టారు. కొందరు దీనిని సమర్ధించినప్పటికీ ఎక్కువ శాతం మంది ఈ ఘటనను ఖండించారు. ఇలాంటి చర్యల వల్ల కేదార్‌నాథ్ ఆలయ పవిత్రత దెబ్బతింటోందని అభిప్రాయపడ్డారు.