Rajasthan : బలవంతంగా రెండో పెళ్లి.. భర్తకు రాఖీ కట్టిన యువతి.. తర్వాతే అసలు ట్విస్ట్!

సినిమా కథను మించిన ట్విస్టులు ఉన్న యువతి ప్రేమ వ్యవహారం ఒకటి రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో వెలుగులోకి వచ్చింది.

Rajasthan : బలవంతంగా రెండో పెళ్లి.. భర్తకు రాఖీ కట్టిన యువతి.. తర్వాతే అసలు ట్విస్ట్!

woman tied rakhi

Updated On : June 13, 2023 / 2:05 PM IST

woman tied rakhi husband : ప్రేమ పెళ్లి చేసుకున్న యువతికి బలవంతంగా రెండో పెళ్లి చేయడంతో రెండో భర్తకు ఆమె రాఖీ కట్టారు. ఈ ఘటనలో రాజస్థాన్ (Rajasthan) లో చోటు చేసుకుంది. అప్పటికే యువతి ఓ యువకుడిని ప్రేమ వివాహం (Love Marriage) చేసుకున్నారు. అయితే ఆ పెళ్లి యువతి ఇంట్లో వారికి ఇష్టం లేదు. దీంతో బలవంతంగా యువతికి మరో వ్యక్తితో వివాహం చేశారు. అయితే బలవంతంగా తనకు తాళి కట్టిన రెండో భర్తకు యువతి రాఖీ కట్టారు.

రాజస్థాన్ జోధ్ పూర్ కు చెందిన తరుణ వర్మ అనే యువతి తన చిన్నప్పటి స్నేహితుడు సురేంద్రను ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ పెళ్లి యువతి కుటుంబ సభ్యులకు ఏ మాత్రం ఇష్టం లేదు. ఈ క్రమంలో పెళ్లైన 10 రోజులకు ఈ జంటను గుర్తించి వేరు చేశారు.

Kandula Durgesh : కాకినాడ జిల్లాలో జనసేన వారాహి యాత్ర.. అనుమతులు ఇచ్చిన పోలీసులు : కందుల దుర్గేష్

అనంతరం యువతిని తమ కులానికి చెందిన ఛత్తీస్ గఢ్ లోని అంతఘర్ కు చెందిన జింతేంద్ర జోషి అనే వ్యక్తితో బలవంతంగా వివాహం జరిపించారు. కానీ, ఆ వివాహం యువతికి ఏ మాత్రం ఇష్టం లేదు. దీంతో పెళ్లైన వెంటనే రెండో భర్తకు యువతి రాఖీ కట్టారు. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు.

Also Read: 7 సంవత్సరాల క్రితం ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఫోటోలో చిన్నారి.. ఇప్పుడు డైరెక్ట్‌గా ఆయనను కలిసింది

అయితే ఆమెకు ముందే పెళ్లి జరిగిందన్న విషయం ఆ వరుడు కుటుంబానికి తెలియదు. అసలు విషయం తెలుసుకున్న వరుడు.. వధువుకు మద్దతుగా నిలిచాడు. దీంతో యువతి తాను ప్రేమ వివాహం చేసుకున్న మొదటి భర్త దగ్గరకు వెళ్లి పోయారు. దీంతో ఈ కథ సుఖాంతమైంది.