Kandula Durgesh : కాకినాడ జిల్లాలో జనసేన వారాహి యాత్ర.. అనుమతులు ఇచ్చిన పోలీసులు : కందుల దుర్గేష్
వారాహి యాత్రకు పోలీసుల తరుపు నుంచి ఎటువంటి ఇబ్బంది లేదని కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అన్నారు. యాత్రకు అన్ని అనుమతులు ఇచ్చామని తెలిపారు.

Kandula Durgesh
Janasena Varahi yatra : కాకినాడ జిల్లాలో జరుగుతున్న జనసేన వారాహి యాత్రకి అనుమతులు తీసుకున్నామని జనసేన నాయకుడు కందుల దుర్గేష్ అన్నారు. పోలీసులు సానుకూలంగా స్పందించి అనుమతులు ఇచ్చారని పేర్కొన్నారు. జన సైనికులు హడావుడి చేయకుండా సజావుగా సభ నిర్వహించుకోవాలని పోలీసులు చెప్పారని వెల్లడించారు. క్రేనుల ద్వారా భారీ పూలమాల వేసే ప్రక్రియ లాంటివి లేకుండా చేసుకోవాలని పోలీసులు సూచించారని తెలిపారు.
భద్రత దృష్ట్యా రాష్ట్ర , జిల్లా స్థాయి వాలంటరీ వ్యవస్థని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ రోజు (మంగళవారం) సాయంత్రం పవన్ కళ్యాణ్ అన్నవరం చేరుకుంటారని చెప్పారు. రేపు(బుధవారం) ఉదయం 9 గంటలకు పవన్ కళ్యాణ్ వారాహికి ప్రత్యేక పూజలు చేసి అన్నవరం వీరవెంకట స్వామిని దర్శించుకుంటారని తెలిపారు. కత్తిపూడిలో భారీ బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేశామని వెల్లడించారు.
వారాహి యాత్రకు పోలీసుల తరుపు నుంచి ఎటువంటి ఇబ్బంది లేదని కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అన్నారు. యాత్రకు అన్ని అనుమతులు ఇచ్చామని తెలిపారు. డీఎస్పీలతో జనసేన నేతలు ఎక్కడికక్కడ టచ్ లో ఉన్నారని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ పర్యటనకు ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. చట్టప్రకారం ఎవరైనా పర్యటనలు చేయవచ్చని తెలిపారు. భద్రత కారణాల దృష్ట్యా మినిట్ టు మినిట్ షెడ్యూల్ మాత్రం ఆడిగామని అన్నారు.