Selfies on moving car: కదిలే కారు బ్యానెట్‌పై సెల్ఫీలు.. ఫైన్ కట్టక తప్పదు గురూ!!
సర్వేలెన్స్ లు పెంచడం పుణ్యమా అని సీసీ కెమెరాలతో రూల్స్ ను ఉల్లంఘించే వాళ్లను పోలీసులు జల్లెడ వేసి..

Selfies On Moving Car
Selfies on moving car: ఈ సర్వేలెన్స్ లు పెంచడం పుణ్యమా అని సీసీ కెమెరాలతో రూల్స్ ను ఉల్లంఘించే వాళ్లను పోలీసులు జల్లెడ వేసి పట్టుకోగలుగుతున్నారు. ఐదు రోజుల క్రితం ఫిరోజాబాద్ పోలీసులు మహీంద్రా స్కార్పియో మీద పుషప్స్ చేసిన వ్యక్తిని అరెస్టు చేశారు. ఇప్పుడు వారితో పాటు కదిలే కారుపై సెల్ఫీలు తీసుకోవడంతో భారీ చలానా వేశారు.
ఫిరోజాబాద్ లో జరిగిన ఘటన వైరల్ అవకముందే పోలీసులు పసిగట్టేశారు. కార్ రిజిస్ట్రేషన్ నెంబర్ నోట్ చేసుకుని రూ.7వేల 500 ఫైన్ వేశారు. మోటార్ వెహికల్ చట్టం ప్రకారం.. పలు సెక్షన్లలో కేసు ఫైల్ చేశారు.
ఈ ఘటన ఫిరోజాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్స్ సమీపంలోనే జరిగింది. ఆ యువకులంతా 20ఏళ్ల లోపు వారేనని విచారణలో తేలింది.
పబ్లిక్ రోడ్లపై చట్ట విరుద్ధమైన స్టంట్లు.. చేయడం అక్రమం. అటువంటి వారికి భారీ ఫైన్లు తప్పవు. పలు కారణాలతో స్టంట్లు చేసే వారిని గుర్తిస్తే మాత్రం వదిలేది లేదు. వీడియోలు రికార్డు చేయడానికి ఎవరైనా ప్రయత్నించడం చాలా ప్రమాదకరం.
ఇలాంటి స్టంట్లు చేసే సమయంలో నిపుణులు కచ్చితంగా సపోర్ట్ ఉండాలి. టీవీల్లో ఆన్ లైన్లో కనిపించేవి వేరేగా ఉంటాయి. ప్రత్యేక జాగ్రత్తలతో, ప్రాణం నష్టం నుంచి కాపాడే విధంగా ఉంటాయి. సేఫ్టీ తీసుకోకుండా జరిగే ఘటనలకు ఏమైనా జరిగే అవకాశాలు ఉన్నాయని.. అందుకే అటువంటి వాటిని జరగకుండా చేయాలని జరిమానాల రూపంలో హెచ్చరిస్తున్నారు.