Amit Shah : ‘ఇక మీ ప్రసంగం ఆపండీ చాలు’ అంటూ హర్యానా హోంమంత్రిపై అమిత్ షా అసహనం

హర్యానా హోం మంత్రిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. ‘అనిల్ జీ ఇక మీ ప్రసంగం ఆపండీ మీకిచ్చిన సమయం అయిపోయింది’ అంటూ సూచించారు. అయినా అమిత్ షా సూచనలు పట్టించుకోకుండా హర్యానా హోంమంత్రి అనిల్ విజ్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. దీంతో పలుమార్లు షా మంత్రి అనిల్ ను ఆపాలని చూసిన వినకపోవటంతో చివరికి మందలించారు.

Amit Shah : ‘ఇక మీ ప్రసంగం ఆపండీ చాలు’ అంటూ హర్యానా హోంమంత్రిపై అమిత్ షా అసహనం

'Your 5 minutes are over' Amit Shah snubs Haryana Home minister Anil Vij

Updated On : October 28, 2022 / 2:49 PM IST

‘Your 5 minutes are over’ Amit Shah-Haryana Home minister Anil Vij : హర్యానా హోం మంత్రిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. అనిల్ జీ ఇక మీ ప్రసంగం ఆపండీ మీకిచ్చిన సమయం అయిపోయింది అంటూ సూచించారు. అయినా అమిత్ షా సూచనలు పట్టించుకోకుండా హర్యానా హోంమంత్రి అనిల్ విజ్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. దీంతో పలుమార్లు షా మంత్రి అనిల్ ను ఆపాలని చూసిన వినకపోవటంతో చివరికి సున్నితంగా మందలించారు.

హర్యానాలోని సూరజ్‌కుండ్‌లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్వహించిన వర్క్‌షాప్‌ నిర్వహించింది. ఈ వర్క్ షాప్ ను అమిత్ షా ప్రారంభించారు. ఈకార్యక్రమంలో హర్యానా హోంమంత్రి అనిలవ్ విజ్ స్వాగత ఉపన్యాసం చేస్తూ..హర్యానా చరిత్ర, హరిత విప్లవానికి దాని సహకారం, ఒలింపిక్స్‌లో రాష్ట్ర క్రీడాకారుల ప్రతిభ, రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన క్రీడా మౌలిక సదుపాయాల గురించి వివరిస్తున్నారు. తన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రతి వారం నిర్వహించే ఫిర్యాదుల పరిష్కార సెషన్ గురించి కూడా మాట్లాడారు. అలా ఆయనకు ఇచ్చిన సమయం మించిపోయినా మాట్లాడుతూనే ఉన్నారు. దీంతో అమిత్ షా అనిల్ కు సూచనలు చేశారు.

అయినా ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తునే ఉన్నారు. అలా మంత్రి అనిల్ ఎనిమిదిన్నర నిమిషాలు ప్రసంగించగా..కొన్ని సీట్ల దూరంలో ఉన్న అమిత్ షా.. తొందరగా ముగించాలని సదరు మంత్రికి ఒక నోట్ పంపారు. కానీ..మంత్రి అనిల్ విజ్ పట్టించుకోకుండా ప్రసంగం కొనసాగించాడు. దీంతో మైక్ ఆన్ చేసిన అమిత్ షా విజ్ కు సైగ చేశారు. అయినా ఆయన ప్రసంగం ఆపలేదు. చివరకు అమిత్ షా కల్పించుకొని ‘అనిల్ జీ మీకు ఐదు నిమిషాలు మాత్రమే ఇచ్చారు. ఇప్పటికి ఎనిమిదిన్నర నిమిషాలు మాట్లాడారు. దయచేసి ముగించండి. ఇంత సుదీర్ఘంగా మాట్లాడేందుకు ఇది వేదిక
కాదు’ అని చెప్పారు.

కానీ అనిల్ తనధోరణిలో తాను మరో పాయింట్ చెప్పాలంటూ అనిల్ విజ్ ఇంకాస్త సమయం అడిగారు. షా అంగీకరించడంతో విజ్ తమ రాష్ట్ర విజయాల సుదీర్ఘ జాబితాను వివరించడం కొనసాగించారు. దాంతో, అమిత్ షా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘అనిల్ జీ దయచేసి నన్ను క్షమించండి. ఇది పని చేయదు. ముగించండి’ అని చెప్పారు. హా ఇక అయ్యింది… సమావేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని గట్టిగా చెప్పారు. షా స్పందన తర్వాత హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ తన ప్రసంగాన్ని మూడు నిమిషాల్లో ముగించడం విశేషం. తాను కూడా ఎక్కువగా మాట్లాడుతే షా ఏమంటారో అనే ఉద్ధేశ్యంతో ఆయన తన ప్రసంగాన్ని మూడు నిమిషాల్లో ముగించేశారు.