Nitin Gadkari : కొవిడ్ టైం బాగా కలిసొచ్చింది.. యూట్యూబ్‌లో నెలకు 4 లక్షలు సంపాదిస్తున్నా!

కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీకి కొవిడ్ మహమ్మారి సమయం బాగా కలిసొచ్చిందంట.. ఈ సమయాన్ని సరిగ్గా వినియోగించుకున్నారట.. తన యూట్యూబ్ ద్వారా గడ్కరీ నెలకు రూ.4 లక్షలు పైనే సంపాదిస్తున్నారట.

Nitin Gadkari : కొవిడ్ టైం బాగా కలిసొచ్చింది.. యూట్యూబ్‌లో నెలకు 4 లక్షలు సంపాదిస్తున్నా!

Union Minister Nitin Gadkari Shares How He Utilised His Time During Covid

Updated On : September 17, 2021 / 12:29 PM IST

YouTube pays me Rs 4 lakh/month : కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీకి కొవిడ్ మహమ్మారి సమయం బాగా కలిసొచ్చిందంట.. ఈ సమయాన్ని సరిగ్గా వినియోగించుకున్నారట.. తన యూట్యూబ్ ద్వారా గడ్కరీ నెలకు రూ.4 లక్షలు పైనే సంపాదిస్తున్నారట.. హరియాణాలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో గడ్కరీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి సమయంలో తన అనుభవాలను గుర్తుచేసుకున్నారు. ఆ సమయాన్ని ఎలా వినియోగించుకున్నారో వివరించారు. కొత్త ఢిల్లీ-ముంబై ఎక్స్ ప్రెస్ వేను సమీక్షించేందుకు వెళ్లిన సందర్భంగా గడ్కరీ తన అనుభవాలను ప్రస్తావించారు.
Covid-19 : కొవిడ్‌ సోకిన గర్భిణుల్లో ఇన్పెక్షన్‌ ముప్పు ఎక్కువ!

కరోనా సమయంలో తాను రెండు విషయాలను బాగా వినియోగించుకున్నానని చెప్పుకొచ్చారు. అందులో మొదటిది.. ఇంట్లో కుకింగ్ చేయడం మొదలుపెట్టారట. ఫుడ్ ఎలా తయారు చేయాలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాఠాలు చెప్పారట.. అందుకు వేదికగా యూట్యూబ్ ఎంచుకున్నారట.. ఆన్ లైన్లో తాన కుకింగ్ పాఠాలను యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారంట.. దాంతో తన ఛానల్ కు ఫుల్ వ్యూయర్ షిప్ వచ్చింది.. అలా తన యూట్యూబ్ ఛానల్ నెలకు లక్షలు సంపాదించే స్థితికి చేరుకుందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం యూట్యూబ్ తనకు నెలకు రూ.4లక్షలకు పైగా చెల్లిస్తోందని గడ్కరీ రివీల్ చేశారు.


అంతేకాదు.. గతంలో ఒక ఘటన గురించి కూడా ప్రస్తావించారు. రోడ్డు, రవాణా శాఖ మంత్రిగా ఉన్న ఆయన.. తనకు పిల్లనిచ్చిన మామ ఇంటినే కూల్చేయించినట్టు గడ్కరీ గుర్తుచేసుకున్నారు. ఆ విషయం తన భార్యకు కూడా చెప్పలేదట.. అప్పట్లో తనకు కొత్తగా పెళ్లి అయిందని తెలిపారు. ఎందుకంటే.. తన మామ ఇల్లు రోడ్డుకు మధ్యలో ఉందని, అందుకే నా భార్య కాంచనకు కూడా చెప్పకుండా మామ ఇంటిని కూల్చేయాలని అధికారులను ఆదేశించినట్ట గడ్కరీ చెప్పారు. అయితే అప్పుడు అది తన మామ గారి ఇల్లుగా అధికారులు తన దృష్టికి తీసుకువచ్చారని అన్నారు. అయినా సరే ఇంటిని కూల్చేయాల్సిందేనని ఆదేశించినట్టు గడ్కరీ నవ్వుతూ తెలిపారు.
Revanth Reddy : శశిథరూర్‌‌కు రేవంత్ రెడ్డి క్షమాపణలు, వివాదానికి ఫుల్ స్టాప్