ఉద్యోగికి కరోనా పాజిటివ్… ఆయుష్మాన్ భారత్ ఆఫీస్ కు తాళం

సెంట్రల్ ఢిల్లీలోని ఆయుష్మాన్ భారత్ ఆఫీసుకు సీల్ వేశారు అధికారులు. ఢిల్లీలోని ఆయుష్మాన్ భారత్ కార్యాలయంలోని ఉద్యోగికి కరోనా పాజిటివ్ రావడంతో ఆఫీస్ ను సీల్ చేశారు. సీఈవో సహా కార్యాలయంలో పనిచేసే ఇతర సిబ్బందికి కరోనా టెస్ట్ లు చేస్తున్నారు.
ఆయుష్మాన్ భారత్ సీఈవో పీఏకు కరోనా సోకడంతో దాదాపు 25మంది ఉద్యోగులను ఇప్పటికే క్వారంటైన్ కు తరలించారు. ఆయుష్మాన్ భారత్ ఆఫీస్ ను శానిటైజ్ చేస్తున్నారు. ఏప్రిల్-24 తర్వాతనే ఆఫీసును తిరిగి తెరిచే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
సెంట్రలో ఢిల్లీలో,ముఖ్యంగా వీఐపీ జోన్ లో ఉండే ఈ కార్యాలయంలో ఉన్న సిబ్బందికి కరోనా సోకడంతో అందరూ టెన్షన్ పడుతున్నారు. టెస్ట్ లకు సంబంధించిన పలితాలు వచ్చాకే ఈ కార్యాలయంలో ఇంకా ఎంతమందికి వైరస్ సోకిందన్నది తెలియనుంది. కాగా,ఢిల్లీలో ఇప్పటివరకు 2,003కరోనా కేసులు నమోదవగా,45మంది ప్రాణాలు కోల్పోయారు.
Also Read | మహబూబ్ నగర్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో కరోనా టెస్టింగ్ బూత్