Zomato CEO : ఫ్రెండ్ షిప్ డే రోజు డెలివరీ బాయ్‌గా మారిన జొమేటో సీఈవో
'ఫ్రెండ్ షిప్ డే' రోజు జొమేటో సీఈవోకి వినూత్న ఆలోచన వచ్చింది. ఈ డేని ఆయన ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నారు. డెలివరీ బాయ్ అవతారం ఎత్తేశారు.

Zomato CEO
Zomato CEO : జొమేటో సీఈవో దీపిందర్ గోయల్ ఫ్రెండ్ షిప్ డేని క్రియేటివ్ గా జరుపుకున్నారు. ఈ స్పెషల్ డే ఎప్పటికీ గుర్తుండిపోయేలా తనే స్వయంగా డెలివరీ పార్టనర్లు, రెస్టారెంట్ పార్టనర్లు, కస్టమర్లకు ఫ్రెండ్ షిప్ బ్యాండ్స్, ఫుడ్ డెలీవరీ చేశారు. డెలీవరి బాయ్ అవతారంలో కనిపించిన జోమాటో సీఈవోను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు.
Zomato : డ్రోన్లతో జొమాటో ఆర్డర్ల డెలివరీ .. బోయ్ చేసిన వినూత్న ఆలోచన
ఫ్రెండ్ షిప్ డేని ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటారు. ఇక వ్యాపారస్తులు ఇలాంటి ప్రత్యేకమైన రోజుల్లో జనాల్ని అట్రాక్ట్ చేసేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తారు. జొమాటే సీఈవో దీపిందర్ గోయల్ ఫ్రెండ్ షిప్ డే రోజు డెలివరీ బాయ్‌గా మారారు. రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్‌పై డెలివరీ పార్టనర్స్, రెస్టారెంట్ పార్టనర్స్, కస్టమర్లకు ఫ్రెండ్ షిప్ బ్యాండ్‌లు.. ఫుడ్ డెలివరీ చేయడానికి రెడీ అయ్యారు. ఈ సందర్భంలో తీసిన కొన్ని ఫోటోలను స్వయంగా తన ట్విట్టర్ అకౌంట్‌లో (@deepigoyal) షేర్ చేశారు. తన పోస్టుకి ‘ డెలివరీ పార్టనర్స్, రెస్టారెంట్ పార్టనర్స్, కస్టమర్లకి ఫుడ్, ఫ్రెండ్ షిప్ బ్యాండ్స్ డెలివరీ చేయడానికి రెడీ అయ్యాను..ఎప్పటికీ మర్చిపోలేని సండే’ అనే శీర్షికను యాడ్ చేశారు.
దీపిందర్ గోయల్ పోస్ట్ వైరల్ అవుతోంది. ‘మీరు చండీగఢ్ లో డెలివరీ చేస్తున్నారు. ఏదో ఒక రోజు మిమ్మల్ని నా డెలివరీ పార్టనర్‌గా చూడాలని అనుకుంటున్నాను’ అని ఒకరు.. ‘జొమాటో ఈ రోజు స్విగ్గి ద్వారా ఆర్డర్ చేస్తోంది. ఇక్కడ ప్రజలు సీఈవోను కలవాలని ఆశిస్తున్నారు’ అని మరొకరు వరుసగా కామెంట్లు పెట్టారు. ఇండియాలో ఫ్రెండ్ షిప్ డే ఆగస్టు మొదటి ఆదివారం జరుపుకుంటారు. ఈ ఏడాది ఆగస్టు 6 న జరుపుకుంటున్నారు. ఇండియాలోనే కాకుండా బంగ్లాదేశ్, యుఎఇ, మలేషియా, యుఎస్‌తో సహా మరికొన్ని దేశాల్లో కూడా ఇదే రోజున ఫ్రెండ్ షిప్ డే జరుపుకుంటారు.
Going to deliver some food and friendship bands to our delivery partners, restaurant partners and customers. Best Sunday ever!! pic.twitter.com/WzRgsxKeMX
— Deepinder Goyal (@deepigoyal) August 6, 2023