10 Years Girl 50 Countries Visit : రోజు స్కూల్‌కు వెళ్తునే 50 దేశాల్లో పర్యటించిన 10ఏళ్ల చిన్నారి .. అదెలాగబ్బా..?!

ఆ చిన్నారి వయస్సు 10ఏళ్లు. పర్యటించింది 50 దేశాలు. అలాగని ఒక్క రోజంటే ఒక్క రోజు కూడా స్కూలుకెళ్లటం మానలేదు. రోజు స్కూల్ కు వెళుతుంది దేశాలు చుట్టేస్తుంది. ఇదెలా సాధ్యం..? వార్నీ ఈ పిల్ల మామూలు పిల్లలా లేదే..

10 Years Girl 50 Countries Visit : రోజు స్కూల్‌కు వెళ్తునే 50 దేశాల్లో పర్యటించిన 10ఏళ్ల చిన్నారి .. అదెలాగబ్బా..?!

10 Years Aditi Tripathi 50 Countries Visit

10 Years Aditi Tripathi 50 Countries Visit : 10 ఏళ్ల బాలిక. ఆ వయస్సులో అందరి పిల్లల్లాగానే స్కూల్ కు వెళుతుంది. బుద్దిగా చదువుకుంటుంది. కానీ ఆ వయస్సుకు నాలుగింతలు ఎక్కువ సంఖ్యలో అంటే 50 దేశాల్ని చుట్టేసింది. అది కూడా ఒక్కరోజు కూడా స్కూల్ కు సెలవు పెట్టకుండానే 50 దేశాల్లో పర్యటించింది. ఇదెలా సాధ్యం అని షాక్ అయ్యారా..? నిజమే మరి..పక్కాగా ప్లాన్ చేస్తే అదేమంత కష్టం కాదంటున్నారు ఆ చిన్నారి తల్లిదండ్రులు. మరి వారి పక్కా ప్లాన్ ఏంటో తెలిసేసుకుందామా..

ఆ పదేళ్ల పాప పేరు అదితి త్రిపాఠి(Aditi Tripathi). ఆమె తల్లిదండ్రులు ఒక చెల్లెలు అద్విత(Advita)తో కలిసి బ్రిటన్ లో ఉంటోంది. అదితి పేరెంట్ దీపక్ త్రిపాఠి(Deepak Tripathi),అవిలాష (Avilasha)బ్యాంకులో అకౌంటెంట్లుగా లండన్ (London) లో బ్యాంక్ (bank లో అకౌంటెంట్లుగా ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్లకు దేశాలు పర్యటించటమంటే ఇష్టం. వారి పిల్లలకు ఆయా దేశాల సంస్కతులను తెలియజేయాలనుకున్నారు. అలా అదితికి మూడేళ్ల వయస్సున్నప్పటినుంచి దేశాలు తిప్పటం ప్రారంభించారు. అలా అదితికి మూడేళ్ల వయస్సులో మొదటిసారి జర్మనీ తీసుకెళ్లారు. అలా ఐరోపాలోని పలు దేశాలతో పాటు నేపాల్(Nepal), భారత్ (Indai),థాయ్ లాండ్(Thailand), సింగపూర్ (Singapore)వంటి 50 దేశాలను తిరిగింది.
Dream Controlling Chip : కలల్ని కంట్రోల్ చేయటానికి డ్రిల్లింగ్ మిషన్‌తో తలకు రంధ్రం చేసి చిప్ పెట్టుకున్న వ్యక్తి .. ఆ తరువాత ఏమైందంటే

వివిధ ప్రాంతాలను చూపించడం వల్ల సమాజంపై పిల్లలకు చక్కటి అవగాహన పెరగుతుందని అదితి తల్లిదండ్రులు ఆలోచన. వివిధ సంస్కృతి, సంప్రదాయాలు, రకరకాల మనుషుల గురించి తమ పిల్లలు తెలుసుకోవాలని వారి ఆశ. అటువంటి అవగాహన వారి జీవితంలో ఎదిగేందుకు ఎంతో ఉపయోగపడుతుందని దీపక్‌ తెలిపారు. అందుకే అదితిని పలు దేశాలు చూపిస్తుంటామని అలా 10ఏళ్లకే ఆమె 50దేశాలు తిరిగిందని తెలిపారు.

మరి చదువుకునే వయస్సులో అలా తిరగటం వల్ల అదితి చదువు పాడవ్వకుండా దీపక్ దంపతులు దానికి తగినట్లుగానే ప్లాన్ చేస్తారు. బ్రిటన్ (Britain) లో స్కూల్స్ వారానికి ఐదు రోజులే ఉంటాయి. సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే క్లాసులు జరుగుతాయి. మిగిలిన రెండు రోజులు సెలవులు. అలా దీపక్ దంపతులు శుక్రవారమే ఏదోక దేశం ప్లాన్ చేస్తారు. రెండు రోజులు అంటే శనివారం, ఆదివారం టూర్ కంప్లీట్ చేసుకుని సోమవారం ఉదయానికల్లా లండన్ చేరుకుంటారు. అదితి రోజులాగానే స్కూల్ కు వెళ్లిపోతుంది.

అలా ఒకోసారి విమానం జర్నీ టైమింగ్ ను బట్టి అదితిని స్కూల్ నుంచే ఎయిర్ పోర్టుకు తీసుకెళ్లేలా ప్లాన్ చేసుకుంటారు. అలాగే టైమింగ్ ను బట్టి ఒక్కోసారి కుదరకపోతే ఎయిర్ పోర్టు నుంచే డైరెక్టుగా స్కూల్ కు వెళ్లేలా ఉంటుంది. అలా ఒక్కరోజు కూడా స్కూల్ కు వెళ్లటం మానకుండా ఒక్క సెలవు కూడా పెట్టకుండా అదితి 10 ఏళ్లకే 50 దేశాలు తిరిగేసింది. టూర్ లో అదితితో పాటు తాము కూడా అలసిపోకుండా ప్లాన్ చేసుకుంటారు.

Gym Trainer : 210కిలోల బరువు బ్యాలెన్స్ చేయలేక మెడ విరిగి చనిపోయిన జిమ్ ట్రైనర్

మరి వారి ప్లాన్ గురించి అదితి తల్లిదండ్రులు ఏం చెబుతున్నారంటే..‘‘ఏ దేశం వెళ్లాలో ముందుగానే అనుకుంటాం. అదితిని శుక్రవారం సాయంత్రం స్కూల్ నుంచి డైరెక్టుగా ఎయిర్ పోర్టుకు తీసుకెళ్లిపోతాం. ఆదివారం రాత్రి 11 గంటల వరకు ఇంటికి చేరుకునేలా ప్లాన్ చేసుకుంటాం. అదితి ఒక్కోసారి ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా స్కూల్‌కి వెళ్లిపోతుంది. ఈ టూర్ల కోసం మేం సంవత్సరానికి 20వేల పౌండ్లు (Pounds )(భారత కరెన్సీలో దాదాపు రూ.21 లక్షలు) ఖర్చు చేస్తాం. టూర్స్ లో బయటి ఆహారం చాలా తక్కువగా తింటాం. దీంతో ఆయా ప్రాంతాల్లో ఫుడ్ తినటం వల్ల వచ్చే సమస్యలు ఉండవు. సాధ్యమైనంతవరకు పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టులోనే జర్నీ చేస్తాం. మేం పొదుపు చేసే డబ్బులతో మా పిల్లలను పలు దేశాలు తిప్పాలనే మా ఆలోచన. దీని కోసం మేం ఇప్పటి వరకు సొంతగా కారు కూడా కొనుక్కోలేదు. అదితికి కంటే రెండే చిన్నపిల్ల ఉంది మాకు. తనకు కూడా సాధ్యమైనని దేశాలు దేశాలను చూపించాలని అనుకుంటున్నాం’’ అని చెప్పారు.

ఈ టూర్ల గురించి అదితి పాప సంబరంగా కొన్ని విషయాలు చెప్పింది. ‘‘నేను తిరిగిన దేశాల్లో నాకు నేపాల్‌, జార్జియా, అర్మేనియా అంటే ఎంతో ఇష్టం. అక్కడ నాకు ఇష్టమైన ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఎవరెస్ట్‌ శిఖరాన్ని కూడా చూశా. గుర్రపు స్వారీ చేశా. ఎన్నో విషయాలను నేర్చుకున్నా. చిన్నపిల్లలకు ఆయా దేశాలు తిరగటం వల్ల ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు’’ అని తెలిపింది. త్వరలో ఫ్రాన్స్‌, ఇటలీ, ఆస్ట్రియాకి కూడా వెళుతున్నానని సంబరంగా చెప్పింది పదేళ్ల చిన్నారు అదితి త్రిపాఠి.

NRIs : అమెరికాలో బియ్యం కొనుగోళ్లకు ఎగబడుతున్న ఎన్నారైలు.. స్టోర్స్ ముందు నో స్టాక్ బోర్డులు

మూడేళ్ల వయసున్నప్పుడు ప్రారంభమైన అదితి పాప పర్యటనలు కొనసాగుతున్నాయి. నేపాల్‌ (Nepal), భారత్‌ (India), థాయ్‌లాండ్‌ ( Thailand), సింగపూర్‌ (Singapore) వంటి ఎన్నో దేశాలను చుట్టేసింది. త్వరలో ఫ్రాన్స్‌, ఇటలీ, ఆస్ట్రియాకి కూడా వెళ్లనుంది.