China : తల్లిపై ఫిర్యాదు చేయటానికి 130 కి.మీ. సైకిల్‌ తొక్కిన బుడతడు

అమ్మమీద కంప్లైంట్ చేయటానికి ఓ బుడతడు 22గంటలపాటు 130 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటు వెళ్లాడు. గంట ప్రయాణం కాస్తా దారి తప్పటంతో 22గంటలపాటు సైకిల్ తొక్కిన పిల్లాడు అలసిపోయాడు. కూడా తెచ్చుకున్న బ్రెడ్డూ జాము కూడా అయిపోయాయి. దీంతో ఆ బుడతడు ఏం చేశాడంటే..

China : తల్లిపై ఫిర్యాదు చేయటానికి 130 కి.మీ. సైకిల్‌ తొక్కిన బుడతడు

11 Year Old Boy Cycles 130km

Updated On : April 13, 2023 / 10:56 AM IST

China :  అమ్మతో గొడవపడ్డాడు 11 ఏళ్ల బుడతడు. ఉండు నీపని చెప్తా..నీమీద కంప్లైంట్ చేస్తానంటూ ఇంటినుంచి వెళ్లిపోయాడు. అలా తన బుజ్జి సైకిల్ తీసుకుని తొక్కుకుంటు ఇంటినుంచి వెళ్లిపోయాడు. అలా ఒకటీ రెండు కాదు ఏకంగా 130 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటు వెళ్లాడు. కానీ ఆ తల్లికి తెలియదు పాపం తన చిన్నబిడ్డడు అలా తనపై కోపంతో వెళ్లిపోయాడని..అలా ఇల్లు వదిలిపోయిన ఆ పిల్లాడు అమ్మ కొట్టింది అంటూ అమ్మమ్మకు ఫిర్యాదు చేయటానికి అమ్మమ్మ ఇంటికి బయలుదేరాడు తన చిన్న సైకిల్ తొక్కుకుంటూ..అలా 22గంటలపాటు 130 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటు వెళ్లిన ఘటన చైనాలో జరిగింది.

అమ్మతో గొడవపడ్డ 11 ఏళ్ల పిల్లాడు జెజియాంగ్ లోని మిజియాంగ్‌లో ఉంటున్న అమ్మమ్మ ఇంటికి సైకిల్‌పై బయలుదేరాడు. వెళుతు వెళుతు దారిలో తినటానికి బ్రెడ్ జామ్ , వాటర్ బాటిల్ వంటివి తన బ్యాగ్ లో సర్ధుకుని మరీ బయలుదేరాడు. దారిలో ఉండే గుర్తుల సహాయంతో సైకిల్ తొక్కుకుంటు వెళ్తునే ఉన్నాడు. అలా మధ్య మధ్యలో ఆగుతు ఇంటి నుంచి వెంట తెచ్చుకున్న బ్రెడ్డు జామ్ తింటు వాటర్ తాగుతు మళ్లీ తిరిగి ప్రయాణం కొనసాగించాడు.

Boy complained to police on mother : ‘అన్నం పెట్టమని అడిగితే అమ్మ కొడుతోంది సార్’ అంటూ 8 ఏళ్ల పిల్లాడు పోలీసులకు ఫిర్యాదు

కానీ కేవలం గంటసేపట్టో అమ్మమ్మ ఇంటికి చేరుకోవాల్సిన పిల్లాడు దారితప్పాడు. ఎంతసేపు సైకిల్ తొక్కినా అమ్మమ్మ ఇల్లు రావటంలేదేంటీ? అని కున్నాడు. కానీ ఆ పిల్లాడికి తెలియలేదు తాను దారితప్పానని..కానీ ఏం చేస్తాడు? దారిలోఉండే గుర్తుల్ని తన చిట్టిబుర్ర గుర్తించనట్లుగానే వెళ్లాడు. కానీ దారితప్పాడు. ఫలితంగా 130 కిలోమీటర్లు సైకిల్ తొక్కి తొక్కి అలసిపోయాడు. ఇక సైకిల్ తొక్కలేక అలసిపోయి ఓ చోట కూర్చున్నాడు. అలా చాలాసేపటినుంచి అక్కడే కూర్చుని ఉన్న బాలుడ్ని గమనించిన కొంతమంది పోలీసులకు సమాచారం అందించారు.

బాలుడు ఉన్న చోటికి వచ్చిన పోలీసులు ఎక్కడికెళుతున్నావు? మీ పేరెంట్స్ ఏరీ? అంటూ ప్రశ్నించారు. దానికి ఆ బుడతడు చెప్పింది విన్న పోలీసులు షాక్ అయ్యారు. నడవలేని స్థితిలో ఉన్న బాలుడిని పోలీసులు తమ కారులో పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. తల్లిదండ్రులకు, అమ్మమ్మకు సమాచారం అందించి బాలుడిని వారికి అప్పజెప్పారు. కోపంలో అమ్మమ్మ ఇంటికి వెళ్లాలని బెదిరించినట్లు బాలుడి తల్లి చెప్పింది. కోప్పడ్డాను దానికి నేను అమ్మమ్మతో నీ పని చెప్తాను అని అన్నాడు. కానీ ఏదో కోపంతో అన్నాడు కానీ ఇలా ఇంటినుంచి వెళ్లిపోతాడనుకోలేదని నా బిడ్డను కాపాడినందుకు ధన్యవాదాలు అని తెలిపారు తల్లీ కూతుళ్లు.

Boy Complaint To Police: మా మమ్మీని అరెస్ట్ చేయండి.. పోలీసులకు మూడేళ్ల బుడ్డోడు ఫిర్యాదు.. వీడియో వైరల్