Boy Complaint To Police: మా మమ్మీని అరెస్ట్ చేయండి.. పోలీసులకు మూడేళ్ల బుడ్డోడు ఫిర్యాదు.. వీడియో వైరల్

మధ్యప్రదేశ్ రాష్ట్రం బుర్హాన్‌పుర్ జిల్లా దేఢ్ తలాయి గ్రామానికి చెందిన మూడేళ్ల బాలుడు సద్దామ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి వాళ్ల మమ్మీపై ఫిర్యాదు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Boy Complaint To Police: మా మమ్మీని అరెస్ట్ చేయండి.. పోలీసులకు మూడేళ్ల బుడ్డోడు ఫిర్యాదు.. వీడియో వైరల్

Boy Complaint To Police

Boy Complaint To Police: చిన్న పిల్లలు చేసే చిలిపి చేష్టలు నవ్వులు తెప్పిస్తాయి. ముద్దు ముద్దు మాటలతో వారుచేసే పనులు ఒక్కోసారి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇలాంటి ఘటన ఒకటి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఓ మూడేళ్ల చిన్నారి ఏకంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి వాళ్ల మమ్మీ మీదే ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో బుడ్డోడు చేసిన పని నెటిజన్లకు నవ్వులు తెప్పిస్తుంది.

Baba Ramdev : సల్మాన్ డ్రగ్స్ తీసుకుంటాడు.. బాబా రాందేవ్ సంచలన వ్యాఖ్యలు

మధ్యప్రదేశ్ రాష్ట్రం బుర్హాన్‌పుర్ జిల్లా దేఢ్ తలాయి గ్రామానికి చెందిన మూడేళ్ల బాలుడు సద్దామ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి వాళ్ల మమ్మీపై ఫిర్యాదు చేశాడు. ఇంతకీ ఆ బుడ్డోడికి వాళ్ల అమ్మమీద కోపమెందుకొచ్చిందంటే.. ముద్దుగా చెంపపై కొట్టిందట. అంతేకాదు, తలస్నానం చేయించాక కాటుక పెడుతుందట. కాటుక పెట్టుకోవటం ఇష్టం లేదని చెప్పినా వినడం లేదట. అంతటితో ఆగకుండా వాళ్ల డాడీ తనకోసం తెచ్చిన చాక్లెట్లన్నీ దొంతనం చేస్తోందట.

Viral video: సెల్‌ఫోన్ కొట్టేశాడన్న అనుమానంతో బాలుడిని బావిలో వేలాడదీసి బెదిరించిన వ్యక్తి

రోజూలాగేనే రెండురోజుల క్రితం వాళ్ల మమ్మీ ముద్దుగా చెంపపై కొట్టింది. అప్పటికే మమ్మీపై ఆగ్రహంతో ఉన్నసద్దామ్ కోపం కట్టలు తెచ్చుకుంది. పోలీస్ స్టేషన్ కు వెళదాం వస్తావా? రావా? అంటూ తండ్రి దగ్గరకు వెళ్లి గొడవపెట్టాడు. దీంతో తండ్రిసైతం బుడ్డోడిని తీసుకొని స్టేషన్ కు వెళ్లి విషయం చెప్పాడు. అక్కడ సబ్ ఇన్ స్పెక్టర్ ప్రియాంకా నాయక్ కు సద్దామ్ ఫిర్యాదును వివరించాడు. మా మమ్మీని జైల్లో పెట్టండి అంటూ చిన్నారి ముద్దుముద్దుగా అడుగుతుండటంతో.. ప్రియాంకా నాయక్ మోకాళ్లపై కూర్చొని బుడ్డోడి ఫిర్యాదును కాగితంపై రాసింది. అనంతరం బుడ్డోడి సంతకం కూడా తీసుకుంది.

అప్పటికి కానీ సద్దామ్ మొఖంలో ఏడుపు తగ్గలేదు. కప్లయింట్ తీసుకున్నందుకు సబ్ ఇన్ స్పెక్టర్ కు ఆ బుడ్డోడు నమస్కారంసైతం చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు బుడ్డోడి దైర్యానికి ఆశ్చర్యపోతున్నారు. ముద్దు ముద్దు మాటలతో బుడ్డోడు చేసిన సందడి నెటిజన్లకు నవ్వులు తెప్పిస్తుంది.