1995లో దుమ్మురేపిన రజినీకాంత్ సినిమా పాటను ఇప్పుడు పాడి.. ఉర్రూతలూగించిన తాత

Viral Video: ఇందులోని పాటలు అప్పట్లో జపాన్‌లోనూ ఎంతో పాపులర్ అయ్యాయి.

1995లో దుమ్మురేపిన రజినీకాంత్ సినిమా పాటను ఇప్పుడు పాడి.. ఉర్రూతలూగించిన తాత

in Pondicherry University

‘‘ఒకడే ఒక్కడు మొనగాడు.. ఊరే మెచ్చిన పనివాడు. విధికి తలొంచడు ఏనాడు.. తల ఎత్తుకు తిరిగే మొనగాడు.. భూమిని చీల్చే ఆయుధమేల పువ్వుల కోసం..’’ అని పాట పాడుతూ రజనీకాంత్ ముత్తు సినిమాలో ఎంట్రీ ఇస్తాడు. 1995లో తమిళంలో విడుదలైన ముత్తు సినిమా.. ఆ తర్వాత దేశంలోని పలు భాషల్లోనూ భారీ వసూళ్లు రాబట్టింది.

ఇందులోని పాటలు అప్పట్లో జపాన్‌లోనూ ఎంతో పాపులర్ అయ్యాయి. జపాన్‌కు చెందిన ఓ వృద్ధుడు (77) తాజాగా ముత్తులోని ఆ ‘ఒరువన్ ఒరువన్’ పాటను పాడి అలరించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. కుబోకి సాన్ అనే వృద్ధుడు మిత్సుబిషి కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్‌ గా కొనసాగుతున్నారు.

పాండిచ్చేరి విశ్వవిద్యాలయంలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆ వృద్ధుడు ఈ పాట పాడుతూ, ట్యూన్స్ కి తగ్గట్లు డ్యాన్స్ కూడా చేశారు. ఆయన పాట పాడిన తీరు, డ్యాన్స్ చేసిన విధానం అందరినీ ఉర్రూతలూగిస్తోంది. ముత్తు పాటలు దక్షిణ భారత్ వారినే కాకుండా జపాన్ వారిని కూడా ఇప్పటికీ ఇంతగా గుర్తుండిపోయాయంటే నమ్మకలేకపోతున్నామంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Also Read: తన యాక్టింగ్ రోల్ మోడల్.. అల్లు అర్జున్ అంటున్న సమంత.. వీడియో వైరల్