Kerala AI Camaras : దేశంలోనే తొలిసారి కేరళలో AI టెక్నాలజీ కెమెరాలతో చలాన్లు ..
ట్రాఫిక్ చలాన్లు విధించే తీరే మారిపోనుంది. దేశంలోనే మొట్ట మొదటిసారిగా.. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఎనేబుల్డ్ కెమెరాలను ఉపయోగించి.. ట్రాఫిక్ చలాన్లు విధించబోతున్నారు కేరళ పోలీసులు.

Kerala AI Camaras traffic challans
Kerala AI Camaras traffic challans : ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (artificial intelligence).. ప్రపంచవ్యాప్తంగా విప్లవాత్మక మార్పుల్ని తీసుకొస్తోంది. ప్రతి రంగంలో.. ఏఐ (AI) టెక్నాలజీ వినియోగం రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. ఇప్పడది ఎక్కడిదాకా వచ్చేసిందంటే..ఆటోమేటిక్‌గా ట్రాఫిక్ చలాన్లు (traffic challans)జనరేట్ చేసేందుకు కూడా ఏఐని వాడేస్తున్నారు. జూన్ 5 (2023) నుంచి కేరళలో ఏఐ ఎనేబుల్డ్ కెమెరాలతో.. ట్రాఫిక్ చలాన్లు విధించబోతున్నారు.
జూన్ 5 నుంచి కేరళ (Kerala)లో ట్రాఫిక్ చలాన్లు విధించే తీరే మారిపోనుంది. దేశంలోనే మొట్ట మొదటిసారిగా.. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఎనేబుల్డ్ కెమెరాలను ఉపయోగించి.. ట్రాఫిక్ చలాన్లు విధించబోతున్నారు కేరళ పోలీసులు. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన వాళ్లందరికీ.. ఏఐ టెక్నాలజీతో చలాన్లు విధించే తొలి రాష్ట్రంగా.. ఇప్పుడు కేరళ అవతరించింది. ఇందుకోసం.. అక్కడి మోటారు వాహనాల శాఖ.. రాష్ట్రవ్యాప్తంగా 726 ఏఐ ఎనేబుల్డ్ కెమెరాలను ఏర్పాటు చేసింది. ఇవి.. అన్ని రకాల ట్రాఫిక్ ఉల్లంఘనలను.. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌తో గుర్తిస్తాయి. ఎలాంటి మానవ ప్రమేయం లేకుండానే.. ఆటోమేటిక్‌గా వాహనదారులకు చలాన్లు విధిస్తాయి.
కేరళ ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. ఆ రాష్ట్రంలో కోటీ 67 లక్షలకు పైనే వాహనాలున్నాయి. వాటిలో.. ఎక్కువ భాగం టూ వీలర్సే ఉన్నాయి. అక్కడి ట్రాఫిక్ పోలీసులు రోజుకు నాలుగున్నర లక్షలకు పైనే ట్రాఫిక్ ఉల్లంఘనలను నమోదు చేస్తున్నారు. కేరళ ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్ ప్రకారం.. రాష్ట్రంలో ప్రతి సంవత్సరం దాదాపు 4 వేల మంది ట్రాఫిక్ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. వచ్చే జూన్ 5 నుంచి ఏఐ సపోర్ట్‌తో సీసీ కెమెరాలు పనిచేయబోతున్నాయి. అవి ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసిన వాళ్లను గుర్తించి.. చలాన్లు కూడా జారీ చేస్తాయి. నిజానికి.. కూడళ్ల దగ్గర సీసీ కెమెరాలు ఇన్ స్టాల్ చేశాకే.. ట్రాఫిక్ ఉల్లంఘనల సంఖ్య సగానికి తగ్గిపోయింది. ఇప్పుడు.. రోజుకు.. రెండున్నర లక్షల ట్రాఫిక్ ఉల్లంఘనలు మాత్రమే నమోదవుతున్నాయి. అంతేకాదు.. కేరళలో ట్రాఫిక్ ప్రమాదాలను తగ్గించేందుకు కూడా ఈ ఏఐ టెక్నాలజీ కెమెరాల ఎఫెక్ట్ చూపుతాయని.. కేరళ ప్రభుత్వం అంచనా వేస్తోంది.
ఇక.. 12 ఏళ్లలోపు చిన్నారులు.. తమ తమల్లిదండ్రులతో కలిసి బైక్‌లపై వెళ్లేలా.. మోటారు వాహనాల చట్టాన్ని సవరించాలని.. కేరళ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ప్రస్తుతం.. టూ వీలర్లపై.. ఇద్దరు మాత్రమే ప్రయాణించడానికి వీలుంది. అయితే.. కేరళలో చాలా మంది తమ బైక్‌ల మీదే.. పిల్లలను స్కూళ్ల దగ్గర డ్రాప్ చేస్తున్నారు. అందువల్ల.. చట్టాన్ని సవరించి.. చిన్నారులు తల్లిదండ్రులతో పాటు ప్రయాణించేందుకు అనుమతి కల్పించాలని కేరళ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.
Kolkata 100 Years Tea : ఈ టీ షాప్‌కి వందేళ్ల చరిత్ర .. రాగిపాత్రలో తయారు చేసే టీ ఫుల్ ఫేమస్..