Port Alsworth Village : అదో అందమైన గ్రామం, పక్క ఊరు వెళ్లాలన్నా విమానంలోనే
అదో అందమైన గ్రామం. పక్క ఊరు వెళ్లాలంటే ఆగ్రామస్తులంతా విమానంలోనే ప్రయాణించాలి. పర్యాటక ప్రదేశమైన ఆ గ్రామంలో ప్రజలు విమానంలోనే ప్రయాణిస్తారు.

Port Alsworth Village, Alaska
Port Alsworth Villege : అదొక అందమైన గ్రామం. పర్వతాలు, పచ్చికబయళ్లు కనువిందు చేసే అందాల గ్రామం. సాధారణంగా గ్రామాల్లో పనుల మీద బయటకు వెళ్లాంటే టూవీలర్ వంటివి వినియోగిస్తుంటారు. కానీ ఆగ్రామంలో అందరు చిన్న చిన్న పనుల కోసం కనీసం రోజువారి నిత్యావససర వస్తువులు అంటే కిరాణా సరుకులు కొనుక్కోవటానికి వెళ్లాలంటూ విమానంలోనే వెళతారు. ఏంటీ ఆగ్రామంలో అందరు అంత రిచ్చా అనుకుంటున్నారా..? రిచ్చా కాదా అనే విషయం పక్కన పెడితే అది వారి అవసరం..అంతే..
ఈ అందాల గ్రామం గురించి చెప్పాలంటే చాలా చాలా అందమైన విశేషాలున్నాయి…మరీ ముఖ్యంగా ఈ గ్రామానికి చెందిన ఓ యువతి గురించి చెప్పి తీరాల్సిందే. ఎందుకంటే ఈ కిరాణా సరుకులు కొనుక్కోవటానికి కూడా విమనంలోనే ప్రయాణిస్తుంది…ఆమె పేరు సెలీనా ఆల్స్‌వర్త్ (Salina Alsworth). వయస్సు 25 ఏళ్లు. ఆ అందమైన గ్రామం పేరు పోర్ట్ ఆల్స్‌వర్త్ (Port Alsworth).జనాభా సంఖ్య కేవలం 186మంది. అమెరికా(america)లోని అలాస్కా(Alaska). అలాస్కాలో ఉందీ గ్రామం.
సెలీనా ఆల్స్‌వర్త్ (Salina Alsworth). పోర్ట్ ఆల్స్‌వర్త్ (Port Alsworth) గ్రామస్తురాలు. పోర్ట్ ఆల్స్‌వర్త్ అనేది పర్వతాలపై ఉన్న మారుమూల ప్రాంతం. అక్కడు ఎటువంటి షాపులు ఉండవు. కనీసం రోడ్డు సదుపాయం కూడా లేదు. ఒక్క ఆస్పత్రి కూడా ఉండదు. పర్యాటకులు వచ్చినప్పుడు ఆ గ్రామం జనాలు ఎక్కువగా కనిపిస్తుంటారు. సెలీనా కుటుంబం 1940లోనే పోర్ట్ ఆల్స్‌వర్త్ లో నివసిస్తోంది. రోడ్డు సౌకర్యం కూడా లేకపోవటంతో పోర్ట్ ఆల్స్‌వర్త్ గ్రామానికి ఎవరైనా వెళ్లాలన్నా..అక్కడనుంచి బయటకు రావాలన్నా అక్కడి చిన్న చిన్న విమానాలే ఏకైక మార్గం.
ఈ ఊరికి దగ్గర్లో కెనాయ్ (Kenai), యాంకరేజ్ (Anchorage) టౌన్ లు ఉన్నాయి. పోర్ట్ ఆల్స్‌వర్త్ కు వెళ్లి రావాలంటే కెనాయ్, యాంకరేజ్ టౌన్ లే ల్యాండింగ్ పాయింట్స్ ఉన్నాయి. పోర్ట్ ఆల్స్‌వర్త్ గ్రామస్తులు ఫుడ్ ప్రోడక్ట్స్ (నిత్యావసర వస్తువులు) తెచ్చుకోవటానికి అక్కడి ప్రజలు ఆ మినీ విమానంలో కెనాయ్, యాంకరేజ్ టౌన్ లకు(Flight Journey For Food) వెళ్లి వస్తుంటారు.
సెలీనా కుటుంబం 1940 నుంచి పోర్ట్ ఆల్స్‌వర్త్ లో నివసిస్తోంది. అక్కడ లేక్ క్లార్క్ రిసార్ట్‌ను నిర్వహిస్తోంది. పోర్ట్ ఆల్స్‌వర్త్ కు పర్యాటకు వస్తుంటారు. వారికి ఉన్న ఒకే ఒక్క రిసార్ట్ సెలీనా కుటుంబం నిర్వహించే రిసార్ట్ మాత్రమే ఆధారం. ఇక్కడే వారు స్టే చేస్తుంటారు. దీంతో సెలీనా రిసార్ట్ కు అవసరమయ్యే ఆహార పదార్థాలు, ఫుడ్ మెటీరియల్, ప్యాకేజింగ్ మెటీరియల్ కావాలంటే ప్రతీరోజు ఆ గ్రామానికి సమీపంలో ఉన్న యాంకరేజ్ టౌన్ కు వెళుతుంది తన భర్త జేర్డ్ రిచర్డ్‌సన్‌తో కలిసి మినీ విమానంలో వెళ్లి వస్తుంటుంది. ఆన్ లైన్ లో ఆర్డర్ చేసిన వస్తువులు తెచ్చుకోవటానికి కూడా ఆమె విమానంలోనే ప్రయాణిస్తుంది.
జేర్డ్ రిచర్డ్‌సన్ ఒక ఫిషింగ్ గైడ్. అతను ఎంతోమంది టూరిస్టులవలెనే ఓ సారి టూరిస్టులతో కలిసి పోర్ట్ ఆల్స్‌వర్త్ కు వచ్చాడు. లేక్ క్లార్క్ రిసార్ట్‌ను నడుపుతున్న సెలీనా ఆల్స్‌వర్త్ తో ప్రేమలో పడ్డాడు. ఇద్దరి మనసులు కలిసాయి. పెళ్లి చేసుకున్నారు. అలా అతను తన భార్యతో కలిసి అతడు రిసార్ట్ నడుపుతూ హాయిగా పోర్ట్ ఆల్స్‌వర్త్ లోనే ఉండిపోయాడు.ఆల్స్ వర్త్ గ్రామం అందానికి పర్యాటకు ముగ్ధులవుతుంటారు. దీంతో పర్యాటకుల తాకిడి ఉంటేనే ఆ గ్రామం సందడిగా కనిపిస్తుంది.