Sri krishnashtami 2023 : బీహార్‌లో కృష్ణాష్టమి రోజు పుట్టిన 1000 మంది బిడ్డలు ..

శ్రీకృష్ణుడు పుట్టిన రోజునే తమ బిడ్డలు పుట్టాలని భావించిన గర్భిణిలు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజునే ప్రసవాలు జరిగేలా ప్లాన్ చేసుకున్నారు. అలా బీహార్ వ్యాప్తంగా 1000మంది బిడ్డలు కిట్టయ్య జన్మదినం రోజునే పుట్టారు.

Sri krishnashtami 2023 : బీహార్‌లో కృష్ణాష్టమి రోజు పుట్టిన 1000 మంది బిడ్డలు ..

babies born In shri krishna janmashtami

Updated On : September 7, 2023 / 2:20 PM IST

Sri krishnashtami 2023 In Bihar: ప్రస్తుతం చాలామంది ముహూర్తాలు పెట్టి డెలివరీలు చేయించుకుంటున్నారు. ఇదో  ట్రెండ్ గా మారింది. మంచి ముహూర్తంలోనే తమ బిడ్డ పుట్టాలని భావిస్తున్నారు తల్లిదండ్రులు.దాని కోసం ప్రసవం సమయం మించిపోయినా.. ప్రసవం సమయం రాకపోయినా ముహూర్తం మాత్రం పక్కాగా ఉండాలనే భావిస్తున్నారు. ఇటువంటి ట్రెండ్ బీహార్ లో కూడా నడుస్తోంది. తాజాగా శ్రీకృష్ణుడు పుట్టిన రోజునే తమ బిడ్డలు పుట్టాలని భావించిన గర్భిణిలు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజునే ప్రసవాలు జరిగేలా ప్లాన్ చేసుకున్నారు. అలా బీహార్ వ్యాప్తంగా 1000మంది బిడ్డలు కిట్టయ్య జన్మదినం రోజునే పుట్టారు.

ఈ ఏడాది చాలా పండుగల తేదీలు గందరగోళంగా ఉన్నాయి. రాఖీ పండుగ, శ్రీకృష్ణ జన్మాష్టమి, వినాయక చవితి పండుగల తేదీల్లో గందగోళం ఏర్పడింది. దీంట్లోభాగంగా శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ కూడా సెప్టెంబర్ 6(2023) అని కొంతమంది కాదు సెప్టెంబర్ 7న అని కొంతమంది భావించారు. దీంతో కొన్ని ప్రాంతాల్లో 6న జరుపుకోగా 7న చాలా ప్రాంతాల్లో మరికొంతమంది జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో బీహార్ లో మాత్రం శ్రీకృష్ణ జన్మాష్టమిని 6నే జరుపుకున్నారు. దీంతో తమ బిడ్డలు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజునే పుట్టాలని భావించినవారు అర్థరాత్రి 12.00గంటలకు ముహూర్తం ఫిక్స్ చేసుకుని మరీ సిజేరియన్లు చేయించుకుని బిడ్డల్ని ప్రసవించారు. బీహార్ లోని లోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి బిడ్డలు పుట్టటంతో సందడి వాతావరణం నెలకొంది.

Shivling : తన కోరిక తీర్చలేదని శివుడిపై యువకుడు కోపం, గుడిలో శివలింగాన్ని చోరీ చేసి ఏం చేశాడంటే..

వీరిలో కొందరు పండుగ రోజునే బిడ్డను కనడం యాదృచ్ఛికం కాగా.. మరికొందరు 6, 7 తేదీల్లోనే ప్రసవం జరిగేలా చూడాలని వైద్యులపై ఒత్తిడి తెచ్చారట! అలా బుధవారం (సెప్టెంబర్ 6,2023)మధ్యాహ్నం 3 గంటల వరకు బిహార్​లోని వేర్వేరు జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో 500 మందికిపైగా మహిళలు బిడ్డలకు జన్మనిచ్చారు. ఇందులో 150 మంది రాజధాని పాట్నాలోనే ప్రసవించారు. బిహార్​లో రోజంతా జరిగిన ప్రసవాలతో కలిపితే 1000 దాటుతుందని డాక్టర్లు తెలిపారు.

ముహూర్తం పెట్టి మరీ..సర్జరీలు
శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగే కాకుండా బీహార్ లో ఇటువంటి ట్రెండ్ కొనసాగుతోందని డాక్టర్లు చెబుతున్నారు. పండుగలతో పాటు ఇతర ప్రత్యేక సందర్భాల్లో ప్రసవం జరిగితే బాగుంటుందని చాలామంది భావిస్తున్నారని దీంతో తాము పెట్టుకున్న ముహూర్తంలోనే బిడ్డ పుట్టేలా అంటే సర్జరీ చేయాలని డాక్టర్లపై ఒత్తిడి కూడా తెస్తున్నారు. దీంట్లో భాగంగానే శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున చాలామంది గర్భిణిలు సర్జరీలు చేయించుకున్నారని ఆ కృష్ణుడు పుట్టిన రోజునే తమ బిడ్డ పుట్టాడని సంతోషపడిపోతున్నారని తెలిపారు.

ప్రస్తుతం ఉన్న చికిత్స విధానాలతో.. అంటే సర్జరీ విధానంతో నాలుగు ఐదు రోజుల ముందు లేదా తరువాత ప్రసవం జరిగేలా చేయవచ్చు. కానీ.. డెలివరీకి ఇంకా 10-15రోజులు సమయం ఉన్నా.. కొందరు పండుగ రోజే ప్రసవం చేయాలని కోరుతున్నారని దానికి తాము అంగీకరించకపోయినా తమపై ఒత్తిడి తెస్తున్నారని తెలిపాడు. వారి కోరికను తాము పరిగణలోకి తీసుకున్నా మరోవైప్ గర్భంలోని శిశువు పరిస్థితి చూశాకే ప్రసవం ఎప్పుడు చేయాలో నిర్ణయిస్తామని..ఏది ఏమైనా ముందస్తు డెలవరీలు చేయటం సరైంది కాదని తెలిపారు.

G20 Summit 2023 : జీ20 దేశాధినేతలకు బంగారు పాత్రల్లో విందు.. భారత సంప్రదాయం ఉట్టిపడేలా ఒక్కో పాత్రకు ఒక్కో విశిష్టత!

శ్రీకృష్ణ జన్మాష్టమి ఏరోజు అనేదానిపై కాస్త గందరగోళం నెలకొన్న క్రమంలో కొందరు బుధవారం అంటే 6నపండుగ జరుపుకోగా మరికొందరు గురువారం చేసుకుంటున్నారు. ఇదే విషయంలో అనుమానంతో ఓ మహిళ ప్రత్యేక ‘డిమాండ్​’ చేశారని తెలిపారు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ సారిక. దాంట్లో భాగంగానే బుధవారం అర్ధరాత్రి 12 గంటలకు ప్రసవం చేయాలని ఓ మహిళ పట్టుపట్టారని దీంతో ఆమె పరిస్థితిని పరిశీలించి ఆమెకు..బిడ్డకు ఏమాత్రం ప్రమాదం జరుగకుండా తగిన మెడిసిన్స్ ఇచ్చి అబ్జర్వేషన్ లో ఉంచామని అలా ఆమె కోరినట్లుగా రాత్రి 11.15 గంటలకు లేబర్ రూమ్​కు తీసుకెళ్లి.. కచ్చితంగా 12 గంటలకు ప్రసవం జరిగేలా చూశామని తెలిపారు.