Viral Video : వాయమ్మో..! ఇవేం పకోడీలమ్మా తల్లీ..! చూస్తే షాక్ .. తింటే షేక్ అవ్వాల్సిందే..

వాయమ్మో...మరీ ఇంత క్రియేటివిటీయా..? అంటూ తెల్లబోయేలా ఓ మహిళ తయారు చేసిన విచిత్రమై పకోడీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చిత్రమైన వంటకాలతో జనాలు హడలెత్తించేస్తున్నార్రా నాయనో అనేలా ఉంది..

Viral Video : వాయమ్మో..! ఇవేం పకోడీలమ్మా తల్లీ..! చూస్తే షాక్ .. తింటే షేక్ అవ్వాల్సిందే..

Pakoda

Biscuit pakoda Viral Video : అదేదో సినిమాలో ఇసిత్రమైన పేర్లు పెట్టి అమ్మి పడదొబ్బుతున్నారు భయ్యా అంటే విని నవ్వుకున్నాం. ఈరోజుల్లో స్ట్రీట్ ఫుడ్స్ ఎన్ని రకాలు..ఎన్నెన్ని వెరైటీలు సోషల్ మీడియా పుణ్యమా అని తెగ చూసేస్తున్నాం. వారి వారి టాలెంట్లకు వాయమ్మో…మరీ ఇంత క్రియేటివిటీయా..? అంటూ తెల్లబోతున్నాం. విచిత్రమైన వంటకాలతో జనాలు హడలెత్తించేస్తున్నారు నాయనో అనిపించేలా సోషల్ మీడియలో తెగ హల్ చల్ చేస్తున్నాయి…

తాజాగా ఒకామె వేసే పకోడీలు చూస్తుంటే వాయమ్మో ఇదేం పకోడీలమ్మా తల్లీ..తింటే కాదు చూస్తేనే కడుపులో ఓ రకంగా ఉందే అనిపించేలా కట్టెల పొయ్యి ముందు పొందిగ్గా కూర్చుని పకోడీలు వేసేస్తోంది. ఇంతకీ ఆమె గారు వేసే పకోడీలు ఏంటా అనుకుంటున్నారా..‘బిస్కెట్ పకోడీ’లండీ బాబు..ఏంటీ వింటేనే మొహం ఓ రకంగా పెట్టేస్తున్నారా…?అంతేమరి మరీ ఇంత క్రియేటివిటీ అయితే తట్టులేంరా నాయినా అనుకోవాల్సిందే..

Shayarcasm ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఈ వీడియోలో ఒకామె పొయ్యి ముందు కూర్చుని బిస్కెట్ పకోడీలు వేసేస్తోంది. బిస్కెట్ల పకోడీలకు ముందు ఆమె ముందుగా ఆ మహిళ బంగాళాదుంపలతో కూర వండింది. తరువాత రెండు బిస్కెట్ల మధ్య కూర మిశ్రమాన్ని పెట్టి తరువాత వాటిని పిండిలో ముంచి.. వాటిని నూనెలో చక్కగా వేసి వేగించేసింది. తరువాత వాటిని ప్లేట్‌లో తీసుకుంది. పక్కన సాస్‌ కూడా ఉంచింది. విభిన్నంగా బిస్కెట్లతో పకోడి తయారు చేసే ఈ వీడియో చూసి జనాలు షాక్ కాదు ఏకంగా షేక్ అవుతున్నారు. ఈ వీడియో చూస్తే భయమేస్తోందంటున్నారు.