Strange Rules For employee : ఈ ఉద్యోగం మద్యంపానం, ధూమపానం, మాంసాహారం అలవాటు లేనివారికి మాత్రమే
మీకు ఉద్యోగం కావాలా..? ఈ ఉద్యోగం కావాలంటే మద్యం తాగకూడదు, సిగిరెట్ తాగకూడదు, మాంసాహారం తినకూడదు. అలా అయితేనే ఉద్యోగం ఇస్తామని కండిషన్స్ పెట్టింది ఓ సంస్థ. మరీ ఇన్ని కండిషన్స్ కు ఓకే అయితే ఈ ఉద్యోగం మీకే..

Chinese company Strange Rules For employee
Chinese company Strange Rules For employee : సాధారణంగా ఓ మంచి కంపెనీలు ఉద్యోగం కావాలంటే ఉద్యోగానికి తగిన అర్హతలు కలిగి ఉండాలి. టెక్నికల్ కావచ్చు, ఆర్థిక లావాదేవీలు వంటి ఉద్యోగాలకు దానికి తగిన అర్హతలు కలిగి ఉండాలి. కానీ చైనాలో ఓ కంపెనీ మాత్రం వినూత్న ప్రకటన చేసింది.తమ కంపెనీ ప్రకటించిన ఉద్యోగానికి మద్యం తాగే అలవాటు లేనివారు..సిగిరెట్ వంటి ధూమపానం అలవాటు లేనివారు కావాలని ప్రకటించింది. అంతేకాదు వారికి మాంసాహారం అలవాటు కూడా ఉండకూడదట..ఇటువంటి వినూత్న ఆంక్షలు పెట్టింది సదరు కంపెని. మరి అ గొప్ప కంపెనీ ఏంటీ..చేయాల్సిన ఉద్యోగం ఏంటీ..ఇన్ని రూల్స్ పెట్టిన ఆ ఉద్యోగానికి ఇచ్చే జీతం ఎంత? అని అనుకుంటున్నారా..? మరి ఆ వినూత్న రూల్స్ వెనుక ఉన్న అసలు విషయం ఏంటో తేల్చేద్దామా..
ది సౌత్ చైనా మార్నిగ్ పోస్ట్ చేసిన దానికి ప్రకారం..షెంజెన్ ఆధారిత ఎలక్ట్రానిక్స్ కంపెనీ ప్రకటించిన ఉద్యోగానికి జీతంగా 5,000 యువాన్లు. అంతే భారత కరెన్సీలో సుమారు రూ.57,000. జీతంతో పాటు ఫ్రీ వసతి కూడా కల్పిస్తోంది సదరు కంపెనీ ఆ ఉద్యోగికి. ఈ ఉద్యోగం చేరాలంటే వారు ధూమపానం, మద్యాపానం అలవాట్లు ఉండకూడదు.అలాగే మాంసాహారం తినకూడదు అని రూల్ పెట్టారు. తీరా ఉద్యోగం ఇచ్చాక ఉద్యోగి ఈ రూల్స్ కంపల్సరిగా పాటించి తీరాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లోను నిబంధనలు ఉల్లంఘించకూడదు.
షెంజెన్ లోని ఓ సంస్థకు చెందిన హెచ్ ఆర్ విభాగంలో పనిచేసే ఓ ఉద్యోగితో జరిపిన సంభాషణ గురించి ఓ అభ్యర్థి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో అదికాస్తా వైరల్ గా మారింది. దీనిపై సదరు అభ్యర్థి ప్రశ్నించగా ఈ నిబంధనలు ఎవరి హక్కుల్ని హరించటానికి కాదని..కేవలం కంపెనీ కార్పొరేట్ సంస్కృతి కోసం ఈ రూల్స్ పెట్టామని ఇంటర్వ్యూ చేసే వ్యక్తి వెల్లడించారు. దీంతో ఇంటర్వ్యూకు వెళ్లిన అభ్యర్థి ఆ ఉద్యోగాన్ని తిరస్కరించినట్లుగా తెలిసింది. ఇది చూసిన నెటిజన్లంతా ఏందిరా ఈ రూల్స్..నువ్విచ్చిన ఉద్యోగానికి తగినట్లుగా పనిచేస్తున్నారా? లేదా అని చూసుకోకుండా ఇటువంటి పిచ్చి పిచ్చి రూల్సేంటీరా బాబూ అంటున్నారు.