IndiGo flight : విమానంలో చంటిబిడ్డ ప్రాణాలు కాపాడిన ఐఏఎస్ అధికారి

విమానంలో అస్వస్థతకు గురైన పాపను ఐఏఎస్ అధికారి కాపాడారు. దీంతో పాప కోలుకుంది. పాప తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు.

IndiGo flight : విమానంలో చంటిబిడ్డ ప్రాణాలు కాపాడిన ఐఏఎస్ అధికారి

doctors save baby in IndiGo flight

Updated On : October 2, 2023 / 5:15 PM IST

doctors save baby in IndiGo flight : విమాన ప్రయాణంలో ఎవరికైనా అస్వస్థత కలిగితే ఆ విమానంలో ఎవరైనా డాక్టర్లు ఉంటే వెంటనే స్పందించటం ఫస్ట్ ఎయిడ్ చేయటం వంటివి చేస్తుంటారు. అదే జరిగింది రాంచి నుంచి ఢిల్లీ వెళ్లే విమానంలో. ఓ చిన్నారి ఉన్నట్లుంగా అస్వస్థతకు గురైంది. ఝార్ఖండ్‌కు చెందిన ఆరు నెలల పాపకు పుట్టుకతోనే గుండె సంబంధిత సమస్య ఉంది. ఆ పాపను చికిత్స కోసం తల్లిదండ్రులు ఢిల్లీ ఎయిమ్స్‌కు తీసుకెళ్లటానికి శనివారం (సెప్టెంబర్30,2023) రాంచీ నుంచి బయలుదేరారు. రాంచీ ఎయిర్ పోర్టులో ఇండిగో ఎయిర్ లైన్స్ ఎక్కారు.విమానం టేకాఫ్ తీసుకుంది. అంతలోనే చిన్నారి అస్వస్థతకు గురైంది.శ్వాస తీసుకోవడానికి కష్టపడింది. తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు.

దీంతో విమానంలో ఎవరైనా డాక్టర్లు ఉంటే స్పందించాలని ఎనౌన్స్ చేయటంతో ఇద్దరు డాక్టర్లు వెంటనే స్పందించారు. వారిలో ఒకరు  ఐఏఎస్ అధికారి. ఆయనే ఝార్ఖండ్‌ గవర్నర్‌ ముఖ్య కార్యదర్శి డాక్టర్‌ నితిన్‌ కులకర్ణి. రాంచీ సదర్‌ ఆసుపత్రికి చెందిన మరో డాక్టర్ మొజామిల్‌ ఫిరోజ్‌‌లు కలిసి ఫస్ట్ ఎయిడ్ చేశారు. దీంతో పాప కొంచెం కోలుకుంది. విమానంలో పెద్దలకు పెట్టే ఆక్సిజన్‌ మాస్కుతో చిన్నారికి ప్రాణవాయువును అందించారు.

UNFPA : ఆ రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళలు స్త్రీల ఆయుర్దాయం ఎక్కువట

పాపకు ఉపయోగించే కొన్ని మెడిసిన్స్ ను తల్లిదండ్రుల వద్ద తీసుకుని దాంట్లో ఉన్న ఓ ఇంజెక్షన్‌ తీసి చేశారు. కొద్దిసేపటికి పాప ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది. ఆ తరువాత ఓ గంటకు విమానం ఢిల్లీ చేరుకుంది. అప్పటికే విమానం సిబ్బంది పాప పరిస్థితి గురించి ముందే సమాచారం అందించటంతో ఢిల్లీ ఎయిర్ పోర్టులో అలెర్ట్ అయ్యారు. అలా వారి విమానం దిగిన వెంటనే పాపకు చికిత్స చేసి అనంతరం వారు వెళ్లాల్సిన హాస్పిటల్ కు చేర్చారు. అలా పాప ప్రాణాల్ని ఐఏఎస్ అధికారితో పాటు మరో డాక్టర్ కాపాడారు.దీంతో పాప తల్లిదండ్రులు వారికి కన్నీటితో ధన్యవాదాలు తెలిపారు.

ఈ ఘటన గురించి నితిన్ కులకర్ణి మాట్లాడుతు..‘పాప ఊపిరి తీసుకోవటానికి చాలా ఇబ్బంది పడింది. బిడ్డ పరిస్థికి తల్లి ఏడుస్తోంది. ఏం చేయాలో తెలీక విమానం దిగేవరకు పాపం పరిస్థితి ఎలా ఉంటుందో అనే ఆందోళనతో తల్లి ఒకటే ఏడుస్తోంది. నేను, డాక్టర్ మొజామిల్ పాప కోలుకునే యత్నాలు చేశాం. దాంతో పాప పరిస్థితి మెరుగు పడటంతో అందరం ఊపిరి తీసుకున్నాం..మాస్క్ గానీ..కాన్యులా అందుబాటులో లేవు..కానీ పెద్దల మాస్క్ ద్వారా ఆక్సిజన్ సరఫరా చేయటంతో పాప కోలుకుంది. పాప మెడికల రిపోర్స్ పరిశీలించగా పుట్టుకతోనే ఆమెకు పేటెంట్ డక్టస్ ఆర్టెరియోసస్ (PDA)తో బాధపడుతోందని తెలిసింది. చికిత్స కోసం ఆ పాపను ఎయిమ్స్‌కు తీసుకెళ్తున్నారు.. తల్లిదండ్రులు డెక్సోనా ఇంజెక్షన్‌ను తీసుకొచ్చారని, ఇది చాలా ఉపయోగపడింది’ అని తెలిపారు.