Employee stuck in lift : ఆఫీసులో లిఫ్ట్ ఆగిపోయి నరకం చూసిన ఉద్యోగి, లేట్‌గా వచ్చాడని శాలరీ కట్ చేసిన బాస్
ఆఫీసుకు వచ్చి లిఫ్ట్ లో ఇరుక్కుపోయాడు ఓ ఉద్యోగి. గంటలపాటు లిఫ్ట్ లో నరకం అనుభవించాడు. తీరా బయటపడ్డాక బాస్ మరో షాక్ ఇచ్చాడు. ఆఫీసుకు రావటం లేట్ అయ్యిదంటు జీతం కట్ చేశారు.

Employee stuck in Office lift..One day Salary cut
Employee stuck in Office lift : ఓ ఉద్యోగి పాపం ఆఫీసు సమయం కంటే ముందే వచ్చాడు. కానీ ఆఫీసు లిఫ్టులో ఇరుక్కుపోయాడు. అలా దాదాపు మూడు గంటలపాటు లిప్టు ఆగిపోవటంతో దాంట్లోనే ఉండిపోయాడు. బయటకు వచ్చేందుకు నానా తిప్పలు పడ్డాడు. ఆఫీసులో లిఫ్ట్ నిర్వాహకులకు సమాచారం అందించాడు. వాళ్లు కూడా వచ్చినా ఫలితం దక్కలేదు. అతను బయటకు రాలేకపోయాడు. ఆఖరికి రెస్క్యూ సిబ్బంది వచ్చి మూడు గంటలపాటు యత్నించి ఎట్టకేలకు తెరవగలిగారు. దీంతో అతను బతుకు జీవుడా అంటూ బయటకొచ్చి ఆఫీసు లోపలికి పరుగుపెట్టాడు.
కానీ ఆఫీసు టైమ్ కంటే లేట్ గా వచ్చావంటూ బాస్ ఒకరోజు సాలరీ కట్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. దీంతో అతను షాక్ అయ్యాడు. అలా ఎలా చేస్తారు..? నేను టైమ్ కంటే ముందే వచ్చాను..కానీ లిఫ్ట్ ఆగిపోయి దాంట్లోనే మూడు గంటలపాటు ఇరుక్కుపోయానని చెప్పినా ఫలితం దక్కలేదు. హెచ్ ఆర్ వద్దకెళ్లమంటూ బాస్ సూచించాడు. హెచ్ ఆర్ అవుట్ అండ్ ఇన్ పంచ్ లతోనే లెక్క అని చెప్పటంతో అతను షాక్ అయ్యాడు. తనకు జరిగిన ఈ ఘటనను రెడ్డిట్ లో పోస్ట్ చేయటంతో అది వైరల్ అవుతోంది.
Tamilnadu Mercantile Bank : క్యాబ్ డ్రైవర్ ఎకౌంట్లో రూ.9,000 కోట్లు జమ, బ్యాంక్ సీఈవో రాజీనామా
ఆ ఉద్యోగి తనకు ఎదురైన ఈ అనుభవాన్ని పంచుకుంటున్నా.. నేను ఆఫీసుకి బయలుదేరాను. ఆఫీసు భవనం వద్దకు చేరుకున్నాను. మా ఆఫీసు 7వ అంతస్థులో ఉంది. దీంతో ఆఫీసు లిఫ్ట్ ఎక్కాను. కానీ అది సడెన్ గా ఆగిపోయింది. కరెంటు లేదు. లిఫ్ట్ మేనేజ్ మెంట్ కు కాల్ చేయటానికి చాలా యత్నించాను. చాలా ప్రయత్నాల తర్వాత.. కాల్ HRకి వెళ్ళింది. నేను లిఫ్ట్‌లో ఇరుక్కుపోయానని తెలియజేశాను. రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకుని లిఫ్ట్‌ను తెరిచేందుకు ప్రయత్నించారు. వరుసగా మూడు గంటల తర్వాత నన్ను లిఫ్ట్‌లోంచి బయటకు తీశారు.
నేను లిఫ్ట్ లోంచి బయటకి రాగానే కోలుకోకముందే నువ్వు లేట్ అవ్వడం వల్ల జీతం కూడా కట్ చేస్తా అన్నారు. నేను షాక్ అయ్యాను. సెలవు తీసుకుని ఇంటికి వెళతానని AMకి చెప్పాను. కానీ AM, ఉద్యోగులు అసలే తక్కువమంది ఉన్నారు మీరు ఎలాగూ ఆఫీసుకు వచ్చాకు కాబట్టి వర్క్ చేయాల్సిందే అని చెప్పారు. డ్యూటీ అవర్స్ ఫిక్స్ అయితే పని చేస్తానని AMకి చెప్పాను. కానీ అతను నాపై ఆరోపణలు చేశారు. దీంట్లో నా తప్పేమీ లేదు లిఫ్ట్ సమస్య వల్ల లేట్ అయ్యింది అని చెప్పాను. దానికి లిఫ్ట్ కెమెరా రికార్డ్, హెచ్‌ఆర్‌తో నా అనుభవాన్ని రికార్డ్ చేశారని రాశారు.
కొన్ని రోజులుగా లిఫ్ట్ లో సమస్యలున్నాయని కానీ సరిగా మెయింటెన్ చేయకపోవటం వల్ల తనకు ఇలాంటి సమస్య వచ్చిందని దాని ఫలితంగా తన తప్పు లేకపోయినా ఒక రోజు జీతం కోల్పోవాల్సి వచ్చిందంటు వాపోయాడు సదరు ఉద్యోగి.
Got Stuck in Elevator at office they marked me absent.
byu/OPIUmTUXEDO inindia