Heart Beat : నిమిషానికి 1,511 సార్లు గుండె కొట్టుకునే జీవి ఏంటో తెలుసా..?
ఆరోగ్యంగా ఉండే మనిషి గుండె నిమిషానికి 60 నుంచి 100సార్లు కొట్టుకుంటుంది. హార్ట్ బీట్ పెరిగింది అంటూ కాస్త ప్రమాదంలో పడినట్లే. కానీ ఓ బుజ్జి జీవి గుండె మాత్రం ఏకంగా నిమిషానికి 1500 కంటే ఎక్కువ సార్లు కొట్టుకుంటుందట.

Etruscan shrew
Etruscan shrew Heart Beat : ఆరోగ్యంగా ఉండే మనిషి గుండె నిమిషానికి 60 నుంచి 100సార్లు కొట్టుకుంటుంది. హార్ట్ బీట్ పెరిగింది అంటూ కాస్త ప్రమాదంలో పడినట్లే. అదే గొర్రె,మేక జాతి జంతువులకు 70 నుంచి 80 సార్లు కొట్టుకుంటుంది. ఆవు, ఎద్దు వంటివాటికి 48 నుంచి 84 సార్లు..అదే భారీ ఆకారంలో ఉండే బ్లూ వేల్ గుండె 33 సార్లు మాత్రమే కొట్టుకుంటుంది. ఒక్కసారి ఊపిరి తీసుకుని వదలటానికి ఈ భారీ జంతువుకి 1.8 సెకన్లు పడుతుందట.
ఇంత భారీ శరీరం కలిగిన ఈ జంతువు గుండె వేగం ఇలా ఉంటే ప్రపంచలోనే అతి చిన్న జీవి గుండె మాత్రం ఏకంగా నిమిషానికి 1500ల కంటే ఎక్కువసార్లు కొట్టుకుంటుందట. ఆ బుల్లి జీవి ఎలుక జాతికి చెందినది. పేరు ‘ఎట్రుస్కాన్ ష్రూ’. ఇది ప్రపంచంలోనే అత్యంత చిన్న క్షీరదం.
ప్రపంచంలోని అతి చిన్న క్షీరదాలలో ఒకటైన ఎట్రుస్కాన్ ష్రూ గుండె నిముషానికి 1,511 సార్లు కొట్టుకుంటుందట. అంటే సెకనుకు 25 సార్లు కొట్టుకుంటుందన్నమాట. ఈ చిన్న ప్రాణి బరువు కంటే 1.5 రెట్లు ఎక్కువ ఆహారం తింటుంది. అందుకే నిరంతరం ఆహారం కోసం వెదుకులాడుతుంటుంది. అద్భుతమైన జీర్ణ వ్యవస్థ కలిగిన ఈ జీవికి ఏది తిన్న ఇట్టే అరిగిపోతుంది. బహుశా అందుకేనేమో దాని బరువు కంటే 1.5 రెట్లు ఎక్కువ ఆహారాన్ని తింటుంది. అంతేకాదు ఈ చిన్న ప్రాణి తనతో సమానంగా ఉండే సైజుగల జీవుల్ని కూడా వేటాడి తినగలదు.
చాలా చురుకుగా ఉంటుందీ జీవి. తన ఆహారాన్ని వేటాడటంలో కూడా చాలా వేగంగా కదులుతుంది. అడవుల్లోను , పొదల్లోను, గడ్డి మైనాల్లోను ఆహారం కోసం వెదుకుతుంది.దానికి అనుగుణంగా దాని పాదాల అమరిక ఉంటుంది. సోరిసిడే కుటుంబానికి చెందిన ఈ ఎట్రస్కాన్ ష్రూ దక్షిణ ఐరోపా, ఆసియాల్లోని కనిపిస్తుంది. దీని పొడవు మూడు నుంచి నాలుగు సెంటీమీటర్లు మాత్రమే ఉంటుంది.
వాసన చూడటంతో అద్భుతమైనది ఈ చిన్న ప్రాణి. వాసన ద్వారా ఆహారాన్ని కనుగొంటుంది. బల్లులు, కప్పలు,బీటిల్స్, గొంగళి పురుగులు, సాలెపురుగులు, వానపాములు, చీమలు, నత్తలు, స్లగ్‌లు మరియు గొల్లభామలు వంటివాటిని ఆహారంగా తింటుంది. మనుషులు నివసించే ప్రాంతాల్లో ఈ జీవులు ఉంటే ఆహారం కోసం ఇళ్లల్లో కూడా చొరబడతాయి.వీటిలో కొన్ని జాతులు నివాసాల గోడల్లో నివసిస్తుంటాయి. భవనాల్లో తమ నివసాలను ఏర్పరచుకుంటాయి.