Cemetery : శ్మశానంలో పెళ్లి ఫోటో షూట్‌లు, పుట్టినరోజు వేడుకలు, పిక్నిక్‌లు

శ్మశానంలో పెళ్లి ఫోటో షూట్‌లు, పుట్టినరోజు వేడుకలు, పిక్నిక్‌లతో జనాలు సందడి చేస్తున్నారు. శ్మశానంలో పిల్లలు కేరింతలు కొడుతున్నారు. పిల్లల పుట్టిన రోజులకు కేక్ కటింగులతో ఆ శ్మశానం వింతగా అన్ని శ్మశానాలకు భిన్నంగా కనిపిస్తోంది.

Cemetery : శ్మశానంలో పెళ్లి ఫోటో షూట్‌లు, పుట్టినరోజు వేడుకలు, పిక్నిక్‌లు

Disa crematorium In Gujarat

Updated On : November 8, 2023 / 5:35 PM IST

Disa crematorium In Gujarat: శ్మశానం అంటే వైరాగ్యాన్ని కలిగించే ప్రాంతం. మృతదేహాలు..వాటికి బంధువులు చేసే.. అంత్యక్రియలు, కర్మకాండలు, ఏడుపులు, పెడబొబ్బలు వంటి విషాదకర ఘట్టాలే గుర్తుకొస్తాయి. అక్కడ నవ్వులకు చోటు ఉండదు. ఆత్మీయుల్ని కోల్పోయిన బాధ.. బరువెక్కిన గుండెలు..ఇలాంటి విషాదకరమైనవే కనిపిస్తాయి.

కానీ గుజరాత్‌లోని బనస్కాంత జిల్లాలోని దిసాలో నిర్మించిన శ్మశాన వాటిక మాత్రం ఫుల్ డిఫరెంట్. అక్కడ చిన్నారుల చిరునవ్వులు వినిపిస్తాయి. ఆనందంతో ఆడుకునే ఆటలు కనిపిస్తాయి. పెళ్లి వేడుకల కోసం వెడ్డింగ్ షూట్ లతో కాబోయే జంటల ఆనందాల కేళి కనువిందు చేస్తుంది. ప్రీ వెడ్డింగ్ షూట్ లతో కాబోయే భార్య భర్తల చిలిపి చిలిపి పనులతో కులికే నును సిగ్గుల సీన్లు దర్శనమిస్తాయి. చిన్నారుల పుట్టిన రోజు వేడులకు కట్ చేసే కేక్ కటింగ్ తుళ్లింతకు కనిపిస్తాయి.స్నేహితులు, ఆత్మీయుల మధ్య జరుపుకునే శుభకార్యాలు కనిపిస్తాయి.

ఇలాంటి శుభాల కార్యక్రమాలకు ఓ శ్మశానం వేదికగా ఉండటం నిజంగా వింతే అని చెప్పాలి. శ్మశానం అంటే కీడు అనేఅంటారు. అటువంటి ప్రదేశాల్లో వేడుకలు జరగటం నిజంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. దాదాపు రూ.7కోట్ల ఖర్చుతో నిర్మించిన ఆ ఆ శ్మశానం ప్రత్యేకత అదే..

NIA : మానవ అక్రమ రవాణా కేసులు .. 10 రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు

దిసా శ్మశానంలో కేవలం అంత్యక్రియలు చేయడానికి కాదు.. పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి, ఫోటో షూట్‌ల కోసం వస్తారు. ఈ శ్మశానాన్ని చూస్తే అది అసలు శ్మశానమేనా లేదా ఏదైనా పార్కా అనిపిస్తుంది. 12,000 చదరపు మీటర్ల లోపు విస్తీర్ణంలో రూ. ఐదు నుంచి ఏడు కోట్ల రూపాయలతో శ్మశాన వాటికను నిర్మించారు.

ఈ శ్మశానం అందం అంతా ఇంతా కాదు. పిక్నిక్‌లు, ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్‌లు మరియు పుట్టినరోజు వేడుకలకు వచ్చే అనేక మందిని ఆకట్టుకుంటోంది. బనాస్ నది ఒడ్డున ఉన్న దిసా శ్మశాన వాటిక అదో రిసార్ట్ లా అనిపిస్తుంది. చక్కటి మొక్కలు. గోడలమీద చక్కటి పెయింటింగులు. అందమైన బొమ్మలు కనిపిస్తాయి.

ఈ శ్మశానం గోపురం లాంటి సిమెంట్ భవనం, పిల్లల దహన సంస్కారాలకు ప్రత్యేక ప్రాంతం ఉంటుంది. శ్మశాన వాటిక ప్రాంతంతో పాటు, ఒక ప్రార్థనా మందిరం కూడా ఉంది. అంతేకాదు ఒక లైబ్రరీ, ఒక పెద్ద తోట, పిల్లల కోసం ప్లే గ్రౌండ్ ఉన్నాయి. ఒక స్మారక సముదాయంతో పాటు..స్నానపు గదులు, మరుగుదొడ్లు ఇతర అనే సౌకర్యాలు ఉన్నాయి. శ్మశానవాటికలో ఓ ప్రాంతం అంతా పూర్తిగా దహన సంస్కారాలకు,మరొకటి పిక్నిక్‌లు,ఇతర కార్యక్రమాలకు కేటాయించారు.

దహన సంస్కారాలకు కేవలం ఒక రూపాయి చెల్లించి కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. నిజంగా దిసా శ్మశానం శ్మశానంలా కాకుండా ప్రియమైన వ్యక్తిని కోల్పోయిన దుఃఖంలో ఉన్నవారికి కూడా ప్రశాంతనిచ్చేలా డిఫరెంట్ గా ఉంటుంది.