Cremation of Bike : మెటార్ బైక్‌కు అంత్యక్రియలు.. పాల్గొన్న చలాన్ల బాధితులు
ఓ వ్యక్తి తన తను ఎంతో ఇష్టంగా కొనుక్కున్న బైకుకు అంత్యక్రియలు చేశాడు. కట్టెలు పేర్చాడు. కొత్త బట్టలు కట్టాడు. పూల దండ వేశాడు. ఆ తరువాత అంత్యక్రియలు చేశాడు.

patna man funeral of bike
Patna man cremation of bike : ఓ వ్యక్తి తన మోటార్ బైకుకు అంత్యక్రియలు కార్యక్రమం నిర్వహించాడు. పెంపుడు జంతువులు చనిపోతే వాటిపై ప్రేమతో అంత్యక్రియలు చేసిన యజమానులను చూశాం. కానీ బైకుకు అంత్యక్రియలు చేయటం సోషల్ మీడియాలో వైరల్ (Viral) అవుతోంది. ఇదేదో వైరల్ అవ్వటం కోసం చేయలేదు. పోలీసులకు తన నిరసనను ఈ విధంగా వ్యక్తపరిచాడు.
అచ్చంగా మనుషులకు అంత్యక్రియలు చేసినట్లుగా కట్టెలు పేర్చి నిప్పు పెట్టాడు. ఎంతోఇష్టంగా కొనుక్కుని రోజు వారీ పనులపై తిరుగుతుంటే పోలీసులు పదే పదే చలాన్లు విధిస్తున్నారు. ఒక్క బైకుకు రోజుకు నాలుగు సార్లు చలాన్లు విధించటంతో కృష్ణకుమార్ అనే సామాజిక కార్యకర్త (social worker Krishnakumar)కు ఒళ్లు మండిపోయింది. ఏదో విధంగా ఈ విషయాన్ని తేల్చేయాలనుకున్నాడు. అందరికి తెలియజేయాలని అనుకున్నాడు. దాని కోసం వినూత్నంగా ఆలోచించాడు. తన మోటర్ బైకు చుట్టు కట్టెలు పేర్చాడు. కొత్త బట్ట కప్పాడు. ఓ పూలదండ వేశాడు. బైక్‌కు కాకుండా.. పక్కన ఉంచిన కర్రలకు నిప్పంటించి నిరసన వ్యక్తం చేశాడు సామాజిక కార్యకర్త కృష్ణకుమార్.
Strange Customs : శ్రావణమాసంలో మహిళలు దుస్తులు ధరించని ఆచారం .. భర్తను కూడా కన్నెత్తి చూడరు
ఈ కార్యక్రమంలో పలువురు చలాన్ల బాధితులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాట్నా నగరంలో పలుచోట్ల సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేసి పదే పదే చలాన్లు విధిస్తున్నారని.. నాకు రోజుకు నాలుగుసార్లు చలాన్ విధించి రూ.4 వేలు జరిమానా వేశారని కృష్ణకుమార్ ఆవేదన వ్యక్తం చేశాడు. సీఎం నితీశ్ కుమార్ ప్రభుత్వం ఈ నిబంధనలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకే బైక్‌కు అంత్యక్రియలు నిర్వహించానని తెలిపారు.
కాగా పాట్నా నగరంలో ఒక్కరోజునే చలాన్లు విధించి రూ.25.26 లక్షలు వసూలు చేశారు ట్రాఫిక్ పోలీసులు. ట్రాఫిక్ నిబంధనలు ఏమాత్రం ఉల్లంఘించినా జరిమానాలు విధించి భారీగా వసూళ్లు చేస్తున్నారు. ఇటువంటి రూల్స్ ప్రతీరోజు ఉంటాయని ఎస్పీ స్పష్టంచేశారు. దీంతో పాట్నా వాసులు హడలిపోతున్నారు. చలాన్ల పేరుతో తమ జేబులు ఖాళీ చేస్తున్నారని మండిపడుతున్నారు. పాట్నాతో పాటు ఆ పరిసర ప్రాంతాల్లో 103 సీసీ కెమెరాలు అమర్చి నిఘా కళ్లతో ఇట్టే పట్టేస్తున్నారు.
Snakes : పాములు అంతరించిపోవటం వల్ల .. ఆడబిడ్డలకు వివాహాలు కావటంలేదట