Jharkhand : రియల్ ‘ఖైదీ’ సినిమా : జైలుకెళ్లిన 10 ఏళ్లకు అనాథగా మారిన కుమారుడ్ని కలిసి తండ్రి
తల్లి అనుమానాస్పదంగా మరణించింది. తండ్రి జైలుపాలయ్యాడు. మూడేళ్ల కొడుకు అనాథ అయ్యాడు. జైలునుంచి విడుదల అయిన తండ్రి కొడుకులు 10ఏళ్లకు కలిసారు. హీరో కార్తీ నటించిన ‘ఖైదీ’ సినిమాను తలపించే ఈ రియల్ స్టోరీ..సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Jharkhand Father And Son Reunite
Jharkhand Father And Son Reunite : తమిళ హీరో కార్తీ నటించిన “ఖైదీ” సినిమా రియల్ గా ఉంటే ఎలా ఉంటుందో అచ్చంగా అటువంటి కథే ఓ వ్యక్తి విషయంలో జరిగింది. ఓ వ్యక్తి భార్య అనుమానాస్పదంగా మరణించిన కేసులో అతనిని అరెస్ట్ చేయటం శిక్ష విధించటంతో జైలుకు తరలించారు. అప్పటికే అతనికి మూడేళ్ల వయస్సున్న కుమారుడు ఉన్నాడు. తల్లి చనపోవటం, తండ్రి జైలుపాలు కాటంతో ఆ మూడేళ్ల పిల్లాడు అనాథలా మారిపోయాడు. తండ్రి రూపం ఆ చిన్నవయస్సులోనే ఆ పసివాడి మనస్సులో ముద్రపడిపోయింది. ఆ తరువాత ఆ పిల్లాడిని ఓ సంస్థ చేరదీసింది. చదివిస్తోంది. ఆ సంస్థ చేసే సేవాకార్యక్రమాల్లో భాగంగా ఓ రోజు ఆ పిల్లాడు అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్నాడు. అన్నం వడ్డిస్తుండగా ఓ వ్యక్తిని చూశాడు. తన తండ్రేమో అని అనుకున్నాడు. ఆ తండ్రి కూడా తన కుమారుడ్ని గుర్తుపట్టాడు. అలా పదేళ్లకు తండ్రీ కొడుకులు కలుసుకున్న ఘటన రామ్‌గఢ్ జిల్లాలో చోటుచేసుకుంది.
ఈ రియల్ స్టోరీ వింటుంటే తమిళ హీరో కార్తీ నటించిన “ఖైదీ” సినిమా గుర్తుకొస్తుంది. ఆ సినిమాలో కార్తీ కూడా జైలుపాలవుతాడు. చేతులకు బేడీలు వేసుకుని కనిపిస్తాడు. జైలునుంచి విడుదల అయి కూతురి కోసం వెళుతున్న క్రమంలో అనుకోకుండా ఫుడ్ పాయిజన్ అయి అస్వస్థతకు గురైన పోలీసులను ఆస్పత్రికి తరలించటానికి కార్తీ సహాయం తీసుకుంటాడు ఓ పోలీసు అధికారి. పోలీసుల్ని లారీలో తాను చెప్పిన ఆస్పత్రికి తరలిస్తే అనాథాశ్రమంలో ఉంటున్న నీ కూతుర్ని చూపిస్తానంటాడు. దీంతో కార్తీ కూతుర్ని కలుసుకోవటం కోసం ఆ పనికి అంగీకరిస్తాడు. ఈక్రమంలో సినిమా కథ రసవత్తరంగా సాగుతుంది. ఇంచుమించు ఇటువంటి రియల్ స్టోరీకి జార్ఖండ్ లో జరిగింది. అరెస్టై జైలుకెళ్లిన వ్యక్తి.. పదేళ్ల తర్వాత అనాథైన కుమారుడ్ని కలిసిన అరుదైన ఘటన రామ్ గఢ్ జిల్లాలో చోటుచేసుకుంది.
2013లో టింకూ వర్మ అనే వ్యక్తి భార్య అనుమానాస్పదంగా మరణించింది. ఈ కేసులో టింకూ వర్మను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. దీంతో వారి మూడేళ్ల కుమారుడు శివమ్ అనాథ అయ్యాడు. ఆ బాలుడి చేరదీయటానికి బంధువులు ఎవరూ రాలేదు. ఈ కానీ శివమ్ ను అధికారులు రామ్‌గఢ్‌లోని డివైన్ ఓంకార్ మిషన్ అనే సేవా సంస్థకు అప్పగించారు. అప్పటినుంచి వారి వద్దే శివమ్ పెరుగుతున్నాడు. అలే పదేళ్లు గడిచాయి. అక్కడే పెరిగిన శివమ్‌కు 13 ఏళ్లు వచ్చాయి. అదే సంస్థకు చెందిన స్కూల్‌లో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. తనను పెంచి చదివిస్తున్న డివైన్ ఓంకార్ మిషన్ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటు ఉంటాడు. ఈ సంస్థ అన్నదానం వంటి పలు సేవా కార్యక్రమా చేస్తుంటుంది. ఈక్రమంలో గత శుక్రవారం (మే2,2023) ఆ సంస్థ అన్నదాన కార్యక్రమం నిర్వహించింది.
ఎంతోమంది వరుసగా కూర్చున్నారు. వారికి సంస్థ నిర్వాహకులు భోజనాలు వడ్డిస్తున్నారు. వారిలో ఉన్న శివమ్ కూడా ఆహారాన్ని వడ్డిస్తున్నాడు. అలా వడ్డిస్తుండగా గడ్డంతో ఉన్న ఓ వ్యక్తిని చూసిన శివమ్ ఆగిపోయాడు. ఆ వ్యక్తిని నిశితంగా చూస్తుండిపోయాడు. తన తండ్రి గుర్తుకొచ్చాడు. చిన్ననాట తన మనస్సులో నిలిచిపోయిన తండ్రి రూపం గుర్తుకొచ్చింది. అతడిని చూసిన తన తండ్రేనా? అనే అనుమానం వచ్చింది. అదే సమయంలో ఆ వ్యక్తి కూడా శివమ్ ను చూసి ఆశ్చర్యపోయాడు. తాను జైలుకెళ్లే సమయంలో తన మూడేళ్ల కొడుకు రూపం పోలికలు కళ్లముందు కదలాడాయి. నా కొడుకేనా? అని ఆశగా చూశాడు. అలా ఇద్దరి చూపులు మన మధ్య ఏదో బంధం ఉందనేలా కలుసుకున్నాడు. ఎట్టకేలకు తండ్రి టింకు వర్మ కొడుకు శివమ్ గుర్తుపట్టాడు. దీంతో 2013లో విడిపోయిన ఆ తండ్రీకుమారులు పదేళ్ల తర్వాత తిరిగి కలుసుకున్నారు. ఇద్దరు కౌగలించుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. అచ్చంగా సినిమా కథను తలపించేలా ఉందీ కథ అనిపిస్తోంది.
తండ్రీ కొడుకును కలిపిన టిక్ టాక్: చెడే కాదు మంచికూడా జరిగిందండోయ్..!
జైలు నుంచి విడుదలైన తర్వాత టింకూ వర్మ కొడుకు కోసం వెదికాడు. కానీ ఎక్కడుతున్నాడో తెలియలేదు. అలా రామ్‌గఢ్‌లోని వికాస్ నగర్ కాలనీలో ఎప్పటికైనా తన కొడుకు దొరుకుతాడనే ఆశతో ఆటో నడుపుతో జీవనం సాగిస్తున్నాడు. అలా ఎట్టకేలకు తండ్రీ కొడుకులు అనూహ్యంగా కలిసారు. తరువాత టింకూ వర్మ మూడేళ్ల వయసులో దూరమైన కుమారుడు శివమ్‌ను తనకు అప్పగించాలని ఆ ఎన్జీవో సంస్థను కోరాడు. శివమ్ కూడా తన తండ్రితో కలిసి ఉంటానని వారికి చెప్పాడు.
దీంతో అన్ని ఫార్మాటీలు పూర్తి చేసి శివమ్‌ను తండ్రి వర్మకు అప్పగించారు. కానీ పదేళ్లు అనుబంధం ఉన్న ఆ సంస్థ నుంచి వెళ్లిపోతూ శివమ్ కన్నీరు పెట్టుకున్నాడు. అనాథ అయిన తనను చేరదీసి సంస్థ నిర్వాహకుల కాళ్లకు దణ్ణం పెట్టి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపాడు. నా తండ్రిని నేను తిరిగి కలుసుకోవటానికి కారణం తనను ఈ సంస్థ చేరదీయటం వల్లనేనని అన్నాడు. నా తండ్రిని నేను తిరిగి కలుస్తానని ఎప్పుడు అనుకోలేదు అంటూ కన్నీరు పెట్టుకున్నాడు. గత పదేళ్లుగా కుమారుడు శివమ్‌ను పెంచడంతోపాటు చదివిస్తున్న ఆ ఎన్జీవో సంస్థకు తండ్రి వర్మ కూడా కృతజ్ఞతలు తెలిపాడు.
డివైన్ ఓంకార్ మిషన్ సేవా ఎన్జీవో సంస్థ మేనేజర్ రాజేష్ నేగి. దిక్కులేనివారిని చేరదీస్తుందీ సంస్థ.వారికి ఆశ్రయం కల్పిస్తుంది. ఉండటానికి వసతి, తిండీ వంటి అన్నీ కల్పిస్తుంది. చిన్నపిల్లలను చదివిస్తుంది.