Gas Cylinder : గ్యాస్ సిలిండరే కిడ్డీ బ్యాంక్.. దాన్నిండా ఏమున్నాయో తెలుసా?
గ్యాస్ సిలిండర్‌ను ఎందుకు ఉపయోగిస్తారని అడిగితే ఏంటీ పిచ్చా వంటలు చేయటానికి అని ఠక్కున చెప్పేస్తారు. కానీ గ్యాస్ సిలిండ్ ను కిడ్డీ బ్యాంక్ లా కూడా ఉపయోగించ వచ్చని మీకెప్పుడైనా ఆలోచన వచ్చిందా..?

Gas cylinder kiddy bank
Gas cylinder kiddy bank : గ్యాస్ సిలిండర్‌ను ఎందుకు ఉపయోగిస్తారని అడిగితే ఏంటీ పిచ్చా వంటలు చేయటానికి అని ఠక్కున చెప్పేస్తారు. కానీ గ్యాస్ సిలిండర్ ను కిడ్డీ బ్యాంక్ లా కూడా ఉపయోగించొచ్చని మీకెప్పుడైనా ఆలోచన వచ్చిందా..? అస్సలు వచ్చి ఉండదు. కానీ ఇదిగో వీళ్లెవరికో గానీ అటువంటి ఐడియా వచ్చింది.
గ్యాస్ సిలిండర్ వంటలకేనా ఏంటీ కిడ్డీ బ్యాంక్ గా కూడా ఉపయోగించుకోవచ్చనే ఐడియా ఎలా వచ్చిందో గానీ అది కూడా ఈ మధ్యేకాదు చాలాకాలం క్రితమే వచ్చినట్లుంది. ఈ వీడియో చూస్తే అదే అర్థమవుతోంది. ఇప్పటి వరకు గ్యాస్ సిలిండర్లతో విన్యాసాలు చేయటం చూసి ఉంటాం. కానీ వీళ్లెవరోగానీ ఏకంగా గ్యాస్ సిలిండర్ ను కిడ్డీ బ్యాంకులా మార్చేసి ఏకంగా దాన్నిండా నాణాలతో నింపేశారు. సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టిన గ్యాస్ సిలిండర్ కిడ్డీ బ్యాంక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కట్టర్ తో కట్ చేసిన ఈ గ్యాస్ సిలిండర్ లో అన్ని పది రూపాయాల కాయిన్సే ఉన్నాయి. అవన్ని కుమ్మరిస్తే ఏకంగా ఓ పేద్ద రాశిలా ఉన్నాయి.
సాధారణంగా పిల్లలకు పొదుపు గురించి నేర్పేందుకు పెద్దవాళ్లు వాళ్లకు మట్టితో చేసిన కిడ్డీ బ్యాంక్ కొని ఇస్తుంటారు. దాంట్లో వారికి ఇచ్చిన పాకెట్ మనీని ఎలా పొదుపు చేసుకోవాలో నేర్పిస్తుంటారు. చిన్న పిల్లలకు మట్టితో, ప్లాస్టిక్‌తో చేసిన చిన్న హుండీలు ఇస్తుంటారు పెద్దవాళ్లు.
Also Read: వాయమ్మో..! ఇవేం పకోడీలమ్మా తల్లీ..! చూస్తే షాక్.. తింటే షేక్ అవ్వాల్సిందే..
అవి నిండిపోయాక పగల గొట్టి ఆ డబ్బులతో గుర్తుండిపోయేలా ఏదోకటి కొనిస్తారు. ఇలాంటి కిడ్డీ బ్యాంకులు చాలా రకాలే ఉన్నాయి గానీ వీళ్లు మాత్రం ఏకంగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ నే కిడ్డీ బ్యాంకులా వాడేసిన విధానం.. ఆ ఐడియా నిజంగా సూపర్ అనిపించేలా ఉంది. మరి మీరు కూడా ఓ లుక్కేయండి ఈ గ్యాస్ సిలిండర్ కిడ్డీ బ్యాంకుపై..
View this post on Instagram