Unique Samosa shop : ఆ సమోసా షాపు పేరు ‘నమ్మకద్రోహం’.. పేరు వెనుక కథా.. ఆ సమోసాల రుచి భలే ఇంట్రెస్టింగ్

ఓ యువకుడు పెట్టిన సమోసా షాపు పేరు వింటే ఏం క్రియేటివిటీరా బాబూ అనిపిస్తుంది. కానీ ఆ పేరు వెనుక ఉన్న కథ వింటే చాలా గొప్పోడు రా.. ఇలాంటివాళ్లు ఎంతోమంది యువకులకు ఆదర్శం అనేలా ఉంది. పైగా సమోసా టేస్టు సూపర్ అనేలా ఈ పేరు వెనుక కథ కూడా సూపర్ అనిపిస్తుంది..

Unique Samosa shop : ఆ సమోసా షాపు పేరు ‘నమ్మకద్రోహం’.. పేరు వెనుక కథా.. ఆ సమోసాల రుచి భలే ఇంట్రెస్టింగ్

Bewafa Samosa shop

Bewafa Samosa shop : కష్టమర్లను ఆకట్టుకోవటానికి టీషాపులతో పాటు హోటల్స్, రెస్టారెంట్లకు వింత వింత పేర్లు సోషల్ మీడియాలో వైరలు అవుతుంటాయి. తిని పొండి,అమ్మ ముద్ద, రా బావా తిని చూడు, తాళింపు, పొట్టనిండింది, నా పొట్ట నాఇష్టం ఇలా చెప్పుకుంటు పోతే ఎన్నో వింత వింత పేర్ల ఏంటీ రాబాబూ ఈ క్రియేటివిటీ అనిపిస్తుంది. మధ్యప్రదేశ్ లో వినీత్ తివారీ అనే ఓ యువకుడు ఓ సమోసా షాపు పేరు చూస్తే ‘ఇతనేదో జీవితంలో బాగా దెబ్బతిని ఉన్నట్లున్నాడే’ అనిపిస్తుంది. ఎవరో మర్చిపోలేనంత ‘ద్రోహం’చేశారనిపిస్తుంది అని సమోసా షాపుకు పెట్టుకున్న పేరు చూస్తే..ఇంతకీ ఆ సమోసా షాపు పేరు ‘నమ్మకద్రోహం’..! ఏంటీ వెరైటీగా ఉండటమే కాదు ఈ పేరు పెట్టుకోవటంలో అతని క్రియేటివిటీయే కాదు అతనికి జరిగిన ‘ద్రోహం’కూడా ఉందంటున్నాడు ఈ యువకుడు.

 

యువకుడికి ద్రోహం అంటే ‘ప్రేమ’ అని ఠక్కున చెప్పేయొచ్చు. మీరు ఊహించింది నిజమే. వినీత్ తివారీ ఓ అమ్మాయిని గాఢంగా ప్రేమించాడు. మరి ఏం జరిగిందో ఏమోగానీ ప్రేమలో విఫలమయ్యాడు. కానీ చాలామంది భగ్రప్రేమికుల్లా కంగిపోలేదు. దేవదాసులా మారి జీవితాన్ని పాడు చేసుకోలేదు. నిలబడ్డాడు. కసిగా ఏదో చేయాలనుకున్నాడు. అలా రేవా పట్టణంలోని ఆదిత్య హోటల్ కు సమీపంలో ఓ సమోసా షాపు పెట్టాడు. ఆ షాపుకు ‘బేవఫా’ సమోషా షాపు అని పేరు పెట్టాడు. ‘బేవఫా’ అంటే నమ్మకద్రోహి, లేదా అవిశ్వాసం అనే అర్థాలు వస్తాయి. “బేవఫా సమోసే వాలా” అనే పేరు పెట్టాడు. వినీత్ తివారీ షాపులో సమోసా రూ.15లు. కానీ వినీత్ తివారీ తన షాపులో ప్రేమికులకు, భగ్నప్రేమికులకు డిస్కౌంట్ కూడా ఇస్తాడు. అటువంటివారికి రూ.10లకే సమోసా ఇస్తాడు.

 

వినీత్ సమోసా షాపులో రైతా సమోసా చాలా ఫేమస్. ఇది కాకుండా మటర్ సమోసా, పెరుగు సమోసా వంటి వైరైటీగా సమోసాలు తయారు చేసిన అమ్మటంలో దిట్ట కూడా. మామిడికాయ చట్నీ, టమాటా చట్నీ వంటి రుచుకరమైన చట్నీలతో వినీత్ సమోసా తింటే వన్ మోర్ అంటారట. అలా వినీత్ తయారు చేసే ఈ వైరైటీ సమోసాలకు మంచి డిమాండ్ ఉంది. సాధారణంగా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడి వేడి సమోసాలు తింటే భలే ఉంటుంది అనకుంటాం. కానీ వినీత్ వెరైటీ సమోసాలను మండుటెండలో కూడా మంచి గిరాకీ ఉంటుందట..అదండీ భగ్న ప్రేమికుడి సమోసా షాపు కథా కమామీషు..

 

ఏది ఏమైనా ప్రేమలో విఫలమైనా జీవితంలో ఓడిపోకుండా ఇలా వెరైటీ పేరుతో సమోసా షాపు పెట్టి అందరిని ఆకట్టుకుంటున్న వినీత్ తివారీలాంటి యువకులు ప్రేమలో విఫలమయ్యామని..ప్రియురాలు మోసం చేసింది చనిపోవటం లేదా ప్రియురాలిని చంపటంవంటి వాటికి పాల్పడేవారికి ఆదర్శం అనే చెప్పాలి.