Funny Video: ఆఖరి మెట్టుపై ఓటమి అంటే ఇదేనేమో? అభినందనీయం!
సోషల్ మీడియా అనేక వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి. ఫన్నీ వీడియోల నుంచి సృజనాత్మకమైన వీడియోలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో షేర్ అవుతుంటాయి.

Pyramid
Funny Video: సోషల్ మీడియా అనేక వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి. ఫన్నీ వీడియోల నుంచి సృజనాత్మకమైన వీడియోలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో షేర్ అవుతుంటాయి. లాక్‌డౌన్ సమయంలో చాలా మంది ఎక్కువగా ఇళ్లలో ఉండగా.. ఆ సమయంలో సృజనాత్మక ఆలోచనలకు రూపం అద్దారు.
లేటెస్ట్‌గా ఓ అమెరికన్ కుర్రాడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో ఆ కుర్రాడు కప్పులతో పిరమిడ్‌ను తయారు చేశారు. వీడియో చూస్తే మొదట ఆశ్చర్యపోతారు.. ఆఖరి మెట్టుపై అనుకున్నది సాధించలేకపోయిన అతనిని చూస్తే కాస్త జాలి వేస్తుంది కూడా.
ఎందుకంటే ఆ అబ్బాయి చాలా కప్పులతో పిరమిడ్‌ను తయారు చేసాడు. అతని కృషి నిజంగా అభినందనీయం. కానీ కొన్నిసార్లు ప్లాన్ వర్కౌట్ అవ్వదు అనేందుకు ఇది నిదర్శనం. వీడియోలో బాలుడు తను కష్టపడి నిర్మించిన ఎత్తైన పిరమిడ్‌పై ఆఖరి మెట్టులో పడిపోయాడు. గంటల తరబడి చేసిన శ్రమ మొత్తం ఫలించకుండా పోయింది.
View this post on Instagram