Man Saves Cow from Lione : ఆవు తలను నోటకరిచిన సింహం .. తెగువతో గోమాతను కాపాడిన రైతన్న

ఓ చూసిన తెగువ ఓ గోమాతను కాపాడేలా చేసింది. సింహం నోట్లో చిక్కుకుని విల్లవిల్లాడిపోతున్న ఆవును ఓ రైతు ధైర్యంతో కాపాడాడు.

Man Saves Cow from Lione : ఆవు తలను నోటకరిచిన సింహం .. తెగువతో గోమాతను కాపాడిన రైతన్న

Man saves cow from lione attack

Updated On : July 1, 2023 / 12:41 PM IST

Man saves cow from lione attack : సింహం వేట ఎలా ఉంటుందో చెప్పనక్కరలేదు. ఓ జంతువును పట్టుకుంది అంటూ వదిలేదేలేదు..అది జీవి దానికి ఆహారం అయిపోవావాల్సిందే. గుజరాత్‌లోని గిర్ సోమ్‌నాథ్ జిల్లా అలీదార్ ప్రాంతంలో ఓ సింహం ఓ ఆవుపై దాడి చేసింది.దాని మెడను దొరకబుచ్చుకుని తన నోటితో పట్టుకుంది. ఆవు పాపం గించుకుంది.కానీ సింహం పట్టునుంచి వదిలించుకోలేకపోయింది. శతవిధాలా సింహం నోటికి చిక్కిన తన తలను విడిపించుకోవాలని పోరాడింది. కానీ దాని శక్తి సరిపోలేదు. బాధతో పెద్దపెద్దగా అరిచింది పాపం గోమాత.

ఆ అరుపులు విన్న ఓ రైతు అక్కడికి వచ్చాడు. సింహం నోట్లో చిక్కుకుని విలవిల్లాడిపోతున్న గోమాతను చూశాడు. దాన్ని ఎలాగైనా రక్షించాలనుకున్నాడు. కానీ తాను ఒంటరివాడు. పైగా చేతిలో ఎటువంటి ఆయుధం లేదు. కానీ సింహం నోటినుంచి ఆవును కాపాడాలనుకున్నాడు. అచుట్టు పక్కల వెతికాడు ఏదైనా దొరుకుతుందేమోనని..మరికొన్ని క్షణాలు ఆలస్యమైతే సింహానికి ఆ గోవు ఆహారంగా మారిపోయేదే. సింహం గోవుపై దాడిచేసిన ఆడసింహం దాని మెడను పట్టుకుని చంపేందుకు యత్నించింది.

సింహం బారి నుంచి తన గోవును కాపాడేందుకు చెయ్యెత్తి గట్టిగా అరుస్తూ సింహాన్ని భయపెట్టే ప్రయత్నం చేశాడు. అయినా సింహం ఏమాత్రం పట్టుసడలించలేదు. ఏమైనా దొరకుతుందేమోనని వెదికిన ఆ రైతు ఓ రాయి కనపడగా దాన్ని తీసుకుని సింహాన్ని అదిలిస్తూ ఇంకాస్త ముందుకెళ్లాడు. దీంతో భయపడిన సింహం ఆవును వదిలేసి పారిపోయింది. గోవు ప్రాణాలతో బయటపడింది. ఈ వీడియోను కేశోడ్ కార్పొరేటర్ వివేక్ కొటాడియా ట్విట్టర్‌లో షేర్ చేయటంతో అది వైరల్ అవుతోంది.